ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాన్పూర్‌లోని సిసమావు, కర్హల్ స్థానాలను ఎస్పీ గెలుచుకుంది. ఘజియాబాద్, ఖైర్, ఫుల్పూర్, మీరాపూర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. మొరాదాబాద్‌లోని కుందర్కి, కతేహరి, మజ్వాన్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాగా.. యూపీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించేందుకు చేరువలో ఉంది. తొమ్మిది స్థానాలకు గాను బీజేపీ ఏడింటిలో సత్తా చాటుతోంది. ఎస్పీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కే సూచనలు…
జార్ఖండ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండో దశ ఎన్నికల పోలింగ్ కోసం జోరుగా ప్రచారం సాగుతోంది. ఫస్ట్ ఫేజ్‌లో 66 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్ నవంబర్ 20న జరగనుంది.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై రెండు నెలల క్రితం కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితురాలు గర్భం దాల్చడంతో ఆలస్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అయోధ్యలో గ్యాంగ్‌రేప్ నిందితుల ఆస్తులపై యోగి ప్రభుత్వం యాక్షన్‌కు దిగింది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాధిత కుటుంబం కలిసింది.
Akhilesh Yadav: బీజేపీ కంచుకోటగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌ని సమాజ్‌వాదీ(ఎస్పీ) బద్దలు కోట్టింది. ఈ రాష్ట్రంలో బీజేపీతో పోలిస్తే ఎస్పీకి అధికంగా ఎంపీ సీట్లు వచ్చాయి. బీజేపీకి 33 సీట్లు రాగా, ఎస్పీకి 37 సీట్లు దక్కాయి.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. కౌశంబి, మచ్లిషహర్, కైరానా స్థానాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు.
ఎన్నికల పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ రోజు జరిగిన గొడవల్లో ఇప్పటికే 10 మందిని జైలుకు పంపడం జరిగిందని స్పష్టం చేశారు.
బీహార్‌లోని ససారాం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ రామ్‌కు కష్టాలు చిక్కుల్లో పడ్డారు. మనోజ్, అతని కుమారుడు ఉజ్వల్ కుమార్‌తో సహా నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. ఓ మైనర్ బాలిక తండ్రి కైమూర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.