రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య సన్నిహితురాలు లక్ష్మీ పడాల NTV తో మాట్లాడింది. ఆమెను శేఖర్ బాషా, ఓ పోలీసు అధికారి ట్రాప్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఆ అంశం మీద ఆమె స్పందించింది. ఓ కేసు విషయమై పోలీస్ అధికారి శ్రీనివాస్ ను కలిసానని పేర్కొన్న ఆమె ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను కొన్ని సంఘటనలు జరిగాయి ఈ విషయమై ఎస్పీని కలవడానికి వెళ్లానన్నారు. అప్పటి నుంచి నా నెంబర్ తీసుకొని నన్ను వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు, కొన్ని రోజులు మంచిగా మాట్లాడాడు, ఆ తర్వాత నుండి నన్ను బెదిరించడం మొదలు పెట్టాడని అన్నారు. నన్ను శారీరకంగా వాడుకొని నన్ను బెదిరించడం మొదలు పెట్టాడు, మా నాన్నని, మా తమ్ముడుని చంపుతానని బెదిరించాడు అని ఆమె అన్నారు. ఈ అంశంలో నా దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని లక్ష్మీ పడాల పేర్కొంది.
Chandrasekhar Reddy: పునరాలోచన చేయండి.. ప్రజావాణిలో అల్లు అర్జున్ మామ ఫిర్యాదు
వాళ్ళు చెప్పింది వినకపోయేసరికి మా నాన్నను స్టేషన్ కు తీసుకెళ్ళి వేధించారని, దీంతో మంగళగిరి డిసిపికి ఫిర్యాదు చేశానని అన్నారు. న్యాయం చేయమని వచ్చే బాధితులకు ఇలాగే చేస్తున్నారని పేర్కొన్న ఆమె ఎస్ పీ, శేఖర్ భాషా ఇద్దరు కలిసి నా వీడియోలను రిలీజ్ చేస్తున్నారని అన్నారు. నా వైపు న్యాయం ఉంది, శేఖర్ భాషా ఎవరు? నన్ను కన్నాడా? పెంచాడా లేక అతని కింద పని చేస్తున్నానా అని ఆమె ప్రశ్నించింది. శేఖర్‌భాషాతో ఫ్రెండ్ షిప్ ఉంది, అతనే నా వీడియోలు, ఛాటింగ్ ఫోటోలు బయటికి తెచ్చాడని అన్నారు. నేను ఎస్ పి పై ఫిర్యాదు చేశా, అప్పటి నుండే వీడియోలు, ఛాటింగ్ లు బయటికి వచ్చాయి. శేఖర్‌భాషా, ఎస్ పీ ఇద్దరి విషయం బయటికి తీసుకురావద్దని బెదిరిస్తున్నారని ఆమె అన్నారు. ఎస్ పీ ఓ వెధవ, ఆడంగోడు, అతని భార్య పోరంబోకు, దమ్ముంటే నీ భర్తను మార్చుకో అంటూ ఎస్పీ భార్యకి ఆమె వార్నింగ్ ఇచ్చింది.