లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
READ MORE: Violence : బాలుడిపై ఉపాధ్యాయుడి దౌర్జన్యం.. 1వ తరగతి విద్యార్థిని తీవ్రంగా కొట్టిన టీచర్
“వక్ఫ్ చట్టం పేరుతో హింసను ప్రేరేపిస్తు్న్నారు. ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాక్కెళ్లి దారుణంగా హత్య చేశారు. ఇంతకీ ఈ ఉదంతానికి ఒడిగట్టిన వ్యక్తులు ఎవరు? వక్ఫ్ భూమి ప్రయోజనం పొందబోయే వాళ్లు ముస్లిం వర్గానికి చెందిన దళితులు, అణగారిన వర్గాల వారే. ఈ భూమి తిరిగి రెవెన్యూ రికార్డుల్లోకి వస్తే.. పేదవాడికి కూడా ఎత్తైన భవనానంలో మంచి ఫ్లాట్ వస్తుంది. పేదలకు మంచి ఫ్లాట్లు వస్తే తమ ఓటు బ్యాంకు పోతుందని విపక్షాలు భయపడుతున్నాయి. అందుకే వీళ్లు హింసను ప్రేరేపిస్తున్నారు.” అని సీఎం యోగి వ్యాఖ్యానించారు.
READ MORE: CM Revanth Reddy : అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి..
సీఏఏ గురించి ముఖ్యమంత్రి ఆధిత్యానాథ్ ప్రస్తావించారు. “ప్రపంచంలోని ఏ దేశంలో అయిన హిందువులు హింసకు గురైతే వాళ్లు భారత్‌కు వస్తారు. కానీ కాంగ్రెస్-ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు దీనికి ఎల్లప్పుడూ అడ్డంకులు సృష్టిస్తాయి. వీళ్లని ఈ పార్టీలు శరణార్థులుగా ఉంచాయి. కానీ బీజేపీ వారిని దత్తత తీసుకుంది. ఈ వక్ఫ్ చట్టం వల్ల వచ్చే భూమి పేదలకు ఆసుపత్రులను అందిస్తుంది. మంచి వైద్య కళాశాలలు నిర్మిస్తారు. మంచి విద్యా కేంద్రాలు సృష్టించబడతాయి. పేద పిల్లలకు చదువుకోవడానికి మంచి సౌకర్యాలు లభిస్తాయి. విపక్షాల ఓటు బ్యాంకు విచ్ఛిన్నమవుతుంది. అందుకే వీళ్లు ఇలాంటి హింసను ప్రేరేపిస్తున్నారు.” అని సీఎం యోగి స్పష్టం చేశారు.