బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైఫల్యంతో ఇండియా కూటమిలో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. అఖిలేష్ యాదవ్‌కు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించాలంటూ వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో 37 మంది ఎంపీలతో లోక్‌సభలో రెండో అతిపెద్ద శక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తే కూటమి గాడిన పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తే ప్రతిపక్ష కూటమి గాడిన పడుతుందని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అన్నారు. ఇంకోవైపు మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.. షేక్ హసీనాకు మరణశిక్ష
లక్నో సెంట్రల్ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. ఎన్నికలు నిర్వహించడానికి బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించినట్లయితే ఇండియా కూటమి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IMD warning: ఐఎండీ వార్నింగ్.. ఈ రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక
మహారాష్ట్ర, హర్యానా.. ఇలా వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన కనబరచడంతో కూటమిలో నాయకత్వం మార్పుపై డిమాండ్ పెరుగుతోంది. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ విఫలమైందని.. కూటమి బాధ్యతలు మమతా బెనర్జీకి అప్పగిస్తే గాడిన పడుతుందని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ 19, ఎంఐఎం 5 సీట్లు సాధించాయి.