South Central Railway: హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వారం రోజుల పాటు 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే క్యాన్సిల్ చేసింది. విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్ల పరిధిలో మెయింటనెన్స్ వర్క్స్ దృష్ట్యా పలు ట్రైన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు మరికొన్ని రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసి మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు తెలిపారు.
ఆగి ఉన్న రైలును పునఃప్రారంభించమని ఆరోపిస్తూ ప్రయాణీకులు రైలును నెట్టడం ఓ వీడియోలో కనపడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపడంతో పలువురు భారతీయ రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Falaknuma Express: యాదాద్రి భువనగిరి జిల్లా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటన ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనలో ఏడు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మొత్తం 18 బోగీల్లో ఏడు బోగీలు దగ్ధం కావడంతో రైలు 11 బోగీలతో సికింద్రాబాద్ చేరుకుంది.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే అధికారులు రైల్వే ప్రయాణికులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. వారం రోజులుగా పలు రైళ్లను రద్దు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలో నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 19 నుంచి 25 వరకు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. రైల్వే ప్రయాణికులకు శుభవార్త. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది.
దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలకుగాను ప్రయాణికులు, సరుకు రవాణా విభాగంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. జోన్ తొలిసారిగా నెలవారీ ప్రయాణీకుల ఆదాయంలో రూ. 500 కోట్ల మార్కును దాటింది.
South central railway: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించారు.