South Central Railway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. కాచిగూడ నుంచి ప్రత్యేక రైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway: తిరుమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లను ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రకటించిన పలు ప్రత్యేక రైళ్లను మరికొన్ని రోజులు పొడిగించారు. కాచిగూడ, తిరుపతి, కాకినాడ, నర్సాపూర్‌లకు పలు ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-తిరుపతి (07061) రైలు 8వ తేదీన, తిరుపతి-కాచిగూడ (07062) రైలు 9వ తేదీన సేవలు అందిస్తాయి. ఈ రైళ్లు షాద్ నగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
Read also: Vande Bharat Train: త్వరలో రాష్ట్రానికి మరో వందే భారత్ ట్రైన్.. రామగుండంలో స్టేషన్
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
10న కాచిగూడ-కాకినాడ టౌన్ (07417) రైలు, 11న కాకినాడ టౌన్-కాచిగూడ (07418) రైలు నడుస్తుంది. ఈ రైళ్లు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. కాచిగూడ-నారాపూర్ (రైలు నెం. 07653) ప్రతి గురువారం 8 నుంచి 29 వరకు అందుబాటులో ఉంటుంది. నర్సాపూర్-కాచిగూడ (07654) రైలు ప్రతి శుక్రవారం 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నడుస్తుంది. ఈ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ టూ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి శ్రీవారి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. దీంతో తిరుమల వెళ్లే రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో అధికారులు తిరుమలకు నిత్యం ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు.
NBK 108: టైటిల్ రివీల్ కే గాల్లోకి లేపుతున్నారుగా?
తాజావార్తలు
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “ఇస్లాం మతంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!