దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలకుగాను ప్రయాణికులు, సరుకు రవాణా విభాగంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. జోన్ తొలిసారిగా నెలవారీ ప్రయాణీకుల ఆదాయంలో రూ. 500 కోట్ల మార్కును దాటింది. ప్రయాణికుల ఆదాయం మే నెలలో రూ. 513.41 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్ లో రూ. 467.82 కోట్లు రాబట్టింది. ఇక సరకుల రవాణా విషయంలోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా లాభాలు అందుకుంది. మే నెలలో 12.517 మిలియన్ టన్నుల సరుకును సౌత్ సెంట్రల్ రైల్వే రవాణా చేసింది.
Also Read : Gujarat : పోర్న్ సైట్లు, న్యూడ్ ఫోటోలు.. ఇలాంటి పార్టనర్ వద్దని పోలీసుల చెంతకు చేరిన భార్య
ఇక దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలలో 26.11 మిలియన్ల మంది ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు చేర్చింది. గత 2022 మే నెలలో 21.12 మిలియన్ల ప్రయాణికులతో పోలిస్తే దాదాపు 24శాతం వృద్ధిని సాధించింది. సాధారణ రైళ్లు కాకుండా సమ్మర్ లో అదనపు అవసరాలను తీర్చడానికి మే మాసంలో సౌత్ జోన్ 538 ట్రిప్పుల స్పెషల్ ట్రైన్స్ ను నడిపింది. దీంతో అదనంగా 4.65 లక్షల మంది ప్రయాణీకులను రవాణా చేయడంతో రూ. 36.52 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. సరుకు రవాణా విభాగంలో మే 2023లో 12.517 ఎమ్‌టీలు సరుకును ట్రాన్స్ పోర్ట్ చేసింది. దీంతో ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా ఒక నెలలో సాధించిన అత్యుత్తమ సరుకు రవాణా లోడింగ్.. గత ఏడాది కంటే దాదాపు 7శాతం ఎక్కువగా నమోదు చేసింది.
Also Read : Urvashi Rautela: మొన్న రూ. 200కోట్ల నెక్లెస్.. నేడు రూ.190 కోట్ల బంగ్లా.. పాపకు అంత సీన్ ఉందా..?
అదే సమయంలో.. సరుకు రవాణా ఆదాయం ఈ ఏడాదిలో 14శాతం వృద్ధి చెంది రూ. మే, 2023లో రూ.1213.36 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది మే, 2022 లో 1065.15 కోట్లు నమోదు చేసింది. దక్షిణ మధ్య రైల్వే సాధించిన ఈ విజయం పట్ల జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఆనందం వ్యక్తం చేశారు. అన్ని శాఖల సిబ్బంది సమన్వయంతో పని చేయడం వల్లే ఈ విజయం సాధించామని ఆయన తెలిపారు.