Hyderabad MMTS: హైదరాబాద్ నగరంలోని ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. వారం రోజుల పాటు 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య అధికారులు వెల్లడించారు. రైల్వే ట్రాక్‌ల నిర్వహణ, మరమ్మతుల కారణంగా రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 6 వరకు.. సంబంధిత రైళ్లను రద్దు చేయనున్నారు. వాటిలో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 12 MMTS రైళ్లు తిరుగుతున్నాయి. వాజానగర్-లింగంపల్లి, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య నడిచే మరో 10 ఎంఎంటీఎస్‌లను కూడా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని సూచించారు.
Read also: Income Tax Calculator: మీరు ఎంత సంపాదిస్తున్నారు.. దానిపై ఎంత పన్ను చెల్లించాలో.. ఇలా తెలుసుకోండి?
విశాఖ-కడప (17488) తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ రైలు విశాఖపట్నం నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సి ఉండగా… దీనికి కోర్బా ఎక్స్‌ప్రెస్‌తో లింక్ ఉంది. ఆ రైలు కోచ్‌లను తిరుమల రైలుకు జత చేస్తారు. వాస్తవానికి కోర్బా ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 6.20 గంటలకు విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది…ఆ తర్వాత బోగీలను శుభ్రం చేసి తిరుమల ఎక్స్ ప్రెస్ కు అటాచ్ చేసి అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు పంపిస్తారు. కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ ఆధునీకరణ పనుల కారణంగా 9 గంటలు ఆలస్యంగా అంటే అర్ధరాత్రి దాటిన కారణంగా గురువారం సాయంత్రం 4.10 గంటలకు బదులుగా మధ్యాహ్నం 1.20 గంటలకు కోర్బా నుండి బయలుదేరింది.
Read also: Andaman Earthquake: అండమాన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదు
ఈ రైలు విశాఖపట్నం చేరుకునే సరికి శుక్రవారం రాత్రి 9.30 గంటలైంది. దీన్ని సిద్ధం చేయడానికి మరో గంట పట్టింది. దీంతో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను 4 గంటలు ఆలస్యంగా సాయంత్రం 6 గంటలకు రీషెడ్యూల్ చేసినట్లు రైల్వే శాఖ ప్రయాణికులకు మెసేజ్‌లు పంపింది. సాయంత్రం 5 గంటలకే వేలాది మంది ప్రయాణికులు విశాఖపట్నం స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే 6 గంటలకు బయలుదేరాల్సిన రైలును రాత్రి 9 గంటలకు మార్చినట్లు రైల్వే శాఖ నుంచి మరో సందేశం రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ తీరుతో తమ తిరుమల యాత్ర అయోమయంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు వెచ్చించి ముందస్తుగా సర్వీసులు, కాటేజీలు బుక్ చేసుకున్నామని వాపోయారు.
Madras High Court: అర్చకత్వానికి కులంతో పని లేదు: మద్రాస్ హైకోర్టు