South Central Railway: సంక్రాంతి రద్దీని దృష్టిని పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు మరో 30 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడపనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ దృష్ట్యా సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వికారాబాద్ నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ మార్గంలో ఈ ప్రత్యేక…
Secunderabad: మరో 36 నెలల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులను రూ.699 కోట్ల వ్యయంతో చేపట్టింది. ఈ పనులు 2025 నాటికి పూర్తి కానున్నాయి. ఈ నిర్మాణ పనులకు సంబంధించి తుది మెరుగులు తీర్చిదిద్దే బాధ్యతను ఐఐటీ ఢిల్లీకి రైల్వేశాఖ అప్పగించింది. భవన నిర్మాణ రూపకల్పన ప్రూఫ్ కన్సల్టెంట్‌గా ఐఐటీ ఢిల్లీని నియమించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా…
South Central Railway: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. రద్దీ దృష్ట్యా ఈనెల 12 నుంచి పలు ప్రాంతాలకు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి, హైదరాబాద్-గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న సికింద్రాబాద్-తిరుపతి మధ్య (రైలు నంబర్ 07411) ప్రత్యేక రైలును నడుపుతున్నామని తెలిపారు. ఈ రైలు సికింద్రాబాద్‌లో సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 6:45 గంటలకు తిరుపతి…
Coach Restaurant: ఇటీవల రెస్టారెంట్లు సాధారణంగా ఉంటే కస్టమర్లకు నచ్చడం లేదు. అందుకే ప్లాట్‌ఫామ్ రెస్టారెంట్, జైల్ రెస్టారెంట్ వంటి యాంబియెన్స్ ఉంటే అలాంటి రెస్టారెంట్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. అందుకే దక్షిణ మధ్య రైల్వే వినూత్నంగా ఆలోచించి ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే కోచ్ రెస్టారెంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గుంటూరు రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఈ రెస్టారెంట్‌ను దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రారంభించారు. రైలు పట్టాలను ఏర్పాటు చేసి వాటిపై స్లీపర్ కోచ్‌ను పూర్తి ఏసీ సదుపాయంతో రెస్టారెంట్‌గా…
రైలు బండి.. దాని స్పీడ్‌పై గతంలోనే అనేక పాటలు వచ్చాయి… కానీ, కాల క్రమంగా రైళ్ల రూపం మారిపోయింది.. వేగం పెరిగింది.. ఇక, జెట్ స్పీడ్‌తో దూసుకెళ్లేందుకు సిద్ధం అయ్యాయి రైళ్లు.. నేటి నుంచి దక్షిణ మధ్య రైల్వేలో రైళ్ల వేగం మరింత పెరగనుంది. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత తొలిసారిగా పట్టాలపై రైళ్లు మరింత స్పీడ్‌తో దూసుకెళ్లనున్నాయి. ట్రాక్ అప్‌గ్రెడేషన్ పనులు పూర్తి కావడంతో ఈ రోజు నుంచి మూడు డివిజన్ల పరిధిలో ప్యాసింజర్,…
Special Trains: తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు తిరుపతి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. ఈ మేరకు సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 21, 28 తేదీల్లో తిరుపతి-సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. ట్రైన్ నంబర్ 07481 తిరుపతిలో రాత్రి 9:10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9:30 గంటలకు సికింద్రాబాద్ చేరనుంది. అటు ఈనెల 22, 29…
Indian Railways: రైళ్లలో ఐదేళ్లలోపు చిన్నారులకు కూడా టికెట్ తీసుకోవాలంటూ వస్తున్న వార్తలను రైల్వేశాఖ ఖండించింది. రైళ్లలో ప్రయాణించే చిన్నారుల టికెట్ బుకింగ్ విషయంలో ఎలాంటి మార్పులు ప్రకటించింది. ఒకటి నుంచి ఐదేళ్ల వయస్సు గల పిల్లలకు పెద్దలకు వర్తించే టికెట్ ధరలు వర్తిస్తాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలందరూ గతంలో తరహాలోనే రైళ్లలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది. అయితే ప్రత్యేకంగా బెర్త్ లేదా సీట్ కేటాయించడం…
South Central Railway: కడప మీదుగా గుంటూరు-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే రైలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి మంగళవారం తెలిపారు. గుంటూరులో ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12:45 గంటలకు చేరుతుందన్నారు. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి…