Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్, ఏకంగా 20 రైళ్లు రద్దు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trains Cancelled: సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో వారం రోజులుగా పలు రైళ్లను రద్దు చేశారు. నిర్వహణ పనుల కారణంగా రెండు డివిజన్లలో అనేక ప్యాసింజర్, MMTS రైళ్లు రద్దు చేయబడ్డాయి. మరికొన్ని రైళ్లు పాక్షికంగా నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు 18 రైళ్లు, 15 నుంచి 21వ తేదీ వరకు రెండు రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. ఈ సందర్భంగా ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
రద్దు చేయబడిన వాటిలో కాజీపేట- డోర్నకల్ (07753), డోర్నకల్- కాజీపేట (07754), డోర్నకల్- విజయవాడ (07755), విజయవాడ- డోర్నకల్ (07756), భద్రాచలం రోడ్- విజయవాడ (07278), విజయవాడ- భద్రాచలం రోడ్ (0799). అలాగే కాజీపేట – సిర్పూర్‌టౌన్ (17003), బల్లార్ష – కాజీపేట (17004), సిర్పూర్‌టౌన్ – భద్రాచలం రోడ్ (17034), సికింద్రాబాద్ – వరంగల్ (07462), వరంగల్ – హైదరాబాద్ (07463), సిర్పూర్‌టౌన్- కరీంనగర్ (07766), కరీంనగర్- నిజామాబాద్ (07893), కాజీపేట – బల్లార్ష (17035), కాచిగూడ – నిజామాబాద్ (07596), నిజామాబాద్ – కాచిగూడ (07593) రైళ్లు రద్దు చేయబడ్డాయి. భద్రాచలంరోడ్- బల్లార్ష (17033), బలార్ష-కాజీపేట (17036), కరీంనగర్- సిర్పూర్ టౌన్ (07765), నిజామాబాద్- కరీంనగర్ (07894) రైళ్లు రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్లను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు హైదరాబాద్‌లో 14 నుంచి 20వ తేదీ వరకు 22 ఎంఎంటీఎస్ రైళ్లను కూడా రద్దు చేశారు.
Also Read
- Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
- Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
- Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
- Warangal Politics: కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లోకి వరంగల్ రాజకీయాలు.. గుండు సుధారాణి పదవితో కొత్త అలక!
12 ప్రత్యేక రైళ్లు
ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వచ్చే వారం వివిధ ప్రాంతాల నుంచి 12 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్టు 13, 14 తేదీల్లో తిరుపతి – కాకినాడ టౌన్ (07063), నర్సాపూర్ – తిరుపతి (07061), కాకినాడ టౌన్ – తిరుపతి (07064), తిరుపతి – నర్సాపూర్ (07062), కాచిగూడ – విల్లుపురం (07424), ఆగస్టు 15న విల్లుపురం – కాచిగూడ (07425), 16న కాచిగూడ-కాకినాడ టౌన్ (07039), 17న కాకినాడటౌన్-కాచిగూడ (17040), దక్షిణ మధ్య రైల్వే అధికారులు సమాచారం అందించారు.
Telangana Rains: తెలంగాణలో వర్షాలకు ఛాన్స్.. వచ్చే మూడ్రోజులు కురిసే అవకాశం
తాజావార్తలు
-
Smriti Mandhana: స్మృతి మంధాన అరుదైన మైలురాయి.. మూడో భారతీయ క్రికెటర్‌గా రికార్డు..
-
XI Jinping: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు గుండెపోటు..? వారసుడిని ప్రకటిస్తే తిరుగుబాటు భయం.?
-
Rohit Yadav: బిగ్ షాక్.. క్రికెటర్ రోహిత్‌పై రెండేళ్ల నిషేధం..
-
Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్!
-
Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!