కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఎంతోమంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ తనదైన రీతిలో స్పందించారు. తాలిబన్లతో పోరాటం సాగించిన ఆఫ్ఘన్ పట్టణాలలో జనజీవనం అతలాకుతలమైందని, అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని సోనూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అక్కడ నివాసమున్న ఎంతోమంది…
సోనూ సూద్… కరోనా కష్ట కాలంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి తాను రిల్ స్టార్ కాదు రియల్ స్టార్ అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం కోరిన వారికి సహాయం అందించాడు. దాంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సోనూ సూద్. అయితే ఈ రియల్ స్టార్ అభిమానులు చాలా మంది చాలా రకాలుగా సోనూ సూద్ పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కొందరైతే వేల కిలోమీటర్లు కాలి…
హీరోలు చాలా మంది ఉంటారు. రియల్ హీరోలు కొందరే. అటువంటి వారిలో సోనూ సూద్ కూడా ఒకరు అంటున్నాడు ఉమా సింగ్. పాతికేళ్ల సైకిలిస్ట్ ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వత శిఖరాగ్రం చేరుకున్నాడు. మొదట సైకిల్ పై కిలిమంజారో బేస్ పాయింట్ దాకా చేరుకున్న ఉమా అక్కడ్నుంచీ కాలి నడకన పర్వత శిఖరాన్ని చేరుకున్నాడు. ఆపైన ఆకాశమంత ఎత్తున నిలుచుని సోనూ సూద్ పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్ లో సోనూ…
కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో సోనూసూద్ లోని మానవతావాదిని ఈ దేశం చూసింది. నిజానికి దానికంటే ముందే అతను ఫెరోషియస్ విలన్ పాత్రలతో పాటు, వినోదాత్మక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్ కు సోనూసూద్ లోని మ్యాచో లుక్ ను తెర మీద ఆవిష్కరించాలనే కోరిక కలిగినట్టుగా ఉంది. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ చేసి…
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో ఓ చిరు వ్యాపారిని సర్ ప్రైజ్ చేశాడు సోనూ సూద్. నగరంలోని బట్మలు ప్రాంతంలో ఉన్న మార్కెట్లో హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యాడు సోనూ. అక్కడ షమీమ్ ఖాన్ అనే చెప్పుల వ్యాపారితో మాట కలిపాడు. రెండు రకాల చెప్పుల జతలు చేతిలోకి తీసుకుని చూసిన ఆయన రేట్స్ కనుక్కున్నాడు. డిస్కౌంట్ ఇస్తావా అంటూ సరదాగా అడిగాడు. ఆ తరువాత చిరు వ్యాపారి షమీమ్ భుజంపై చేయి వేసి “మీకు చెప్పులు కావాలంటే…
నటుడు సోనూసూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో వలసకూలీలకు అండగా నిలిచి దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తున్న సంగతి తెలిసిందే. విపత్తు సమయంలో సోనూ చేసిన సేవా కార్యక్రమాలకు అభినందనలతో పాటుగా.. పలు అవార్డులు ఆయనకు దక్కాయి. అయితే తాజాగా సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ.. ‘స్పెషల్ ఒలింపిక్స్…
తెరపై కనిపించేదంతా నిజం కాదు అని సినిమాలు చూసే జనానికి తెలుసు. కానీ, తాము అభిమానించే నటీనటులు కనబరిచే అభినయానికి ఫిదా అయిపోతూ, ఈలలు కేకలు వేసి ఆనందిస్తుంటారు. అలాగే తెరపై కరడుగట్టిన హృదయం ఉన్న విలన్ గా నటించేవారికి, నిజజీవితంలో కరుణ చూపే తత్వం ఉంటుందని తెలిసినప్పుడూ జనం అదే తీరున స్పందిస్తూ ఉన్నారు. అనేక చిత్రాలలో ప్రతినాయకునిగా పలకరించి, భయపెట్టిన సోనూ సూద్ నిజజీవితంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇదిగో నేనున్నానంటూ ముందడుగు వేస్తున్నారు.…
నాగలి పట్టి పొలం దున్నే రైతు… లాఠీ పడితే? ఎలా ఉంటుందో నేను చూపిస్తానంటున్నాడు సోనూ సూద్! కరోనా మహమ్మారి సమయంలో సూపర్ హీరోగా మారిపోయిన సోనూ సూద్ జూలై 30న ఓ ఎవర్ గ్రీన్ 90స్ సాంగ్ కీ రీమేక్ వర్షన్ తో… మన ముందుకు రాబోతున్నాడు! Read Also : ఆమీర్ ఖాన్ కూతురు ‘సెక్స్ ఎడ్యుకేషన్’ స్టోరీ… ‘తుమ్ తో ఠెహర్ పర్ దేసీ’ పాట అప్పట్లో చాలా పెద్ద హిట్. అల్తాఫ్…
ప్రముఖ నటుడు సోనూసూద్ కోవిడ్ -19 సంక్షోభ సమయంలో తాను చేసిన సేవతో రియల్ హీరోగా ఎదిగారు. భారతదేశం అంతటా ప్రజలకు అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న ఈ నటుడికి ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. దీంతో ఆయన క్రేజ్ ఇప్పుడు అమాంతంగా ఎవరెస్ట్ అంత ఎత్తుకు చేరుకుంది. ఈ కారణంగా సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే ఆఫర్లు భారీగా వస్తున్నాయి. కొంతమంది అయితే ఏకంగా సోనూసూద్ ను హీరోగా పెట్టి సినిమా…
లాక్ డౌన్ ఆపద్బాంధవుడు సోనూసూద్ తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు నుంచి పొందుతున్నాడు. తాజాగా నేడు తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్ లో సోనూసూద్ కలిశారు. కాగా, సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలలనుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. Read Also: ‘అమ్మాయి…