సోనూ సూద్… కరోనా కష్ట కాలంలో ఆపదలో ఉన్నవారికి సహాయం చేసి తాను రిల్ స్టార్ కాదు రియల్ స్టార్ అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం కోరిన వారికి సహాయం అందించాడు. దాంతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సోనూ సూద్. అయితే ఈ రియల్ స్టార్ అభిమానులు చాలా మంది చాలా రకాలుగా సోనూ సూద్ పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. కొందరైతే వేల కిలోమీటర్లు కాలి నడకన సోనూ సూద్ ను కలవడానికి కూడా వెళ్లారు. అయితే ఇప్పుడు మరో సోనూ సూద్ అభిమాని కిలిమంజారో కొండంత అభిమానం చాటుకున్నాడు. ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో పర్వతం శిఖరానికి చేరుకొని… మన జాతీయ జెండాతో కూడిన పోస్టర్ లో సోనూ సూద్ ను చూపిస్తూ ‘రియల్ హీరో ఆఫ్ ఇండియా’ అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మిడిఐలో వైరల్ గా మారింది.