ప్రేమకథను తలపించేలా సోనూసూద్, నిధి మ్యూజిక్ వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో సోనూసూద్ లోని మానవతావాదిని ఈ దేశం చూసింది. నిజానికి దానికంటే ముందే అతను ఫెరోషియస్ విలన్ పాత్రలతో పాటు, వినోదాత్మక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రముఖ నృత్య దర్శకురాలు, దర్శకురాలు ఫరాఖాన్ కు సోనూసూద్ లోని మ్యాచో లుక్ ను తెర మీద ఆవిష్కరించాలనే కోరిక కలిగినట్టుగా ఉంది. తొంభైలలో అల్తాఫ్ రాజా పాడగా సూపర్ డూపర్ హిట్ అయిన ‘తుమ్ తో ఠహ్రే పరదేశీ’ గీతాన్ని రీక్రియేట్ చేసి ‘సాత్ క్యా నిభావోగే’ పేరుతో లేటెస్ట్ గా సోనూసూద్, నిధి అగర్వాల్ పై ఫరాఖాన్ చిత్రీకరించింది. గత కొంతకాలంగా సోనూసూద్ ను జనం ఎలా ఊహించుకుంటున్నారో అందుకు భిన్నంగా, పూర్తి స్థాయిలో ఓ హ్యాడ్సమ్ హీరోలా ఈ మ్యూజిక్ వీడియోలో సోనూసూద్ కనిపించాడు.
ఈ వీడియో లో ఫరాఖాన్ ఓ చక్కని ప్రేమకథను తెలిపే ప్రయత్నం చేసింది. కొంతమంది గుండాలను పట్టుకోవడానికి పోలీస్ అధికారి సోనూసూద్ పబ్ లోకి ఎంటర్ అయ్యి, వారిని పట్టుకుంటాడు. అదే పబ్ లో అతని మాజీ ప్రేయసి నిధి అగర్వాల్ డాన్సర్ గా ఉండటం చూసి ఆశ్యర్యపోతాడు. అతన్ని పోలీస్ ఆఫీస్ గా చూసి ఆమె కూడా షాక్ కు గురవుతుంది. వీరిద్దరి మధ్య కొన్నేళ్ళ క్రితం పల్లెటూరిలో జరిగిన ప్రేమాయణాన్ని ఫరాఖాన్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించారు. అనివార్య పరిస్థితుల్లో సోనూకు నిధి దూరమై పోతుంది. అయితే తిరిగి వాళ్ళిద్దరూ ఇలా కలుసుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. దాదాపు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ మ్యూజిక్ వీడియోను పంజాబ్ లోని పచ్చని పొలాల నడుమ తీశారు. ఏడేళ్ళ క్రితం ఫరాఖాన్ దర్శకత్వం వహించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ మూవీలో సోనూసూద్ కీలక పాత్ర పోషించాడు. బహుశా అప్పటి నుండీ సోనూను వేరే విధంగా చూపించాలనే కోరిక ఫరాఖాన్ లో ఉండిపోయినట్లుంది. ఈ గీతాన్ని అల్తాఫ్ రాజాతో కలిసి టోనీ కక్కర్ పాడాడు. సోనూసూద్, నిధి అగర్వల్ జంట అభిమానులకు కనువిందు చేసేలా ఉంది. దాంతో ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!