దేశవ్యాప్తంగా ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. తన సోనూసూద్ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ ఎవరు సాయం అంటే ఆక్కడ సోనూ వాలంటీర్లు వాలిపోయి సాయం చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సోనూ ఫౌండేషన్ కి పలువురు దాతలు విరాళాలు ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వరికుంటపాడుకి చెందిన అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి సోనూ ఫౌండేషన్ కి 15వేలు విరాళంగా అందచేశారు. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన సోనూసూద్ తన…
కరోనా సమయంలో అవసరం రాగానే సోనూసూద్ వైపు చూస్తున్నారు ప్రజలు.. సాధారణ పౌరులే కాదు.. సెలబ్రిటీలు సైతం సోనూసూద్ ద్వారా సాయం పొందుతున్నారు. ఇటీవల సురేష్ రైనా సైతం సోనూసూద్ నుంచి సాయం అందుకోగా లేటెస్ట్‌గా మరో ఇండియన్ క్రికెటర్‌కు సైతం అడగ్గానే సాయం చేశాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్ సమయంలో వలసకార్మికులను సొంత ఊళ్లకు పంపడానికి స్పెషల్‌గా రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసి సాయం చేసిన సోనూసూద్.. సెకండ్ వేవ్ సమయంలో బెడ్, ఆక్సిజన్, ప్లాస్మా,…
కరోనా కష్ట కాలంలో రియల్ హీరో సోనూసూద్ ఎంతోమంది ప్రాణాలను కాపాడి వారి పాలిట దేవుడిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా దేశంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో మెరుపు వేగంతో పని చేస్తున్నారు సోనూసూద్. డబ్బును కోట్లలో ఖర్చు పెట్టి కరోనా రోగుల ప్రాణాలను కాపాడుతున్నారు. తాజాగా సోనూసూద్ సాయం అర్థించారు టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్. ‘డియర్ సోనూసూద్ భాయ్… హైదరాబాద్ లో ఉన్న పొడుగు వెంకట రమణ అనే వ్యక్తికి ఒక ఇంజెక్షన్…
సినిమాలో విలన్ గా నటించే సోనూ సూద్ కరోనా సమయంలో తాను ఓ రియల్ హీరో అని అనిపించుకున్నాడు. దేశంలో ఏ మూలాన ఎవరు సహాయం అడిగిన కాదనకుండా చేస్తూ వస్తున్నాడు. అయితే సోనూ సూద్ తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకు సాయం చేసి మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. కేవలం 10 నిమిషాల్లోనే ఆక్సిజన్ సిలిండర్‌ను పంపి తనలోని మానవత్వాన్ని చూపారు. ‘మీరట్‌లో ఉన్న మా ఆంటీ కోసం అత్యవసరంగా…
ఎవరికి ఏం కావాలో దానిని అందించడమే సోనూసూద్ లక్ష్యంగా ఇప్పుడు మారిపోయింది. శుష్క వాగ్దానాలకు, రాజకీయ విమర్శలకు తావు ఇవ్వకుండా సోనూసూద్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాంతో ఇవాళ దేశ వ్యాప్తంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా సోనూ సూద్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. నిన్న బెంగళూరులోని ఓ హాస్పిటల్ కు కొద్ది గంటల వ్యవథిలోనే ఆక్సిజన్ ను సరఫరా చేసి దాదాపు పాతిక పైగా ప్రాణాలను కాపాడిన సోనూసూద్ బృందం ఇప్పుడు…
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇంతకుముందు కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు చేసిన సాయంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆయన కష్టం అన్నవారికి కాదనకుండా ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఎక్కడ కష్టం అనే మాట వినిపించిన అక్కడ వాలిపోతున్నారు. ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ సమయంలోనూ సోనూసూద్ వేగంగా స్పందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సోనూసూద్ చేస్తున్న సాయం ఆయనను పేదల పాలిట దేవుడిని చేస్తోంది.…
సోనూ సూద్ అభిమానులందరికీ ఓ శుభవార్త. తాజాగా జరిపిన కోవిడ్ 19 పరీక్షలలో తనకు నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని సోనూ సూద్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. నిజానికి కొద్ది రోజుల ముందు సోనూసూద్ కు కరోనా టెస్ట్ లో పాజిటివ్ అనే రిపోర్ట్ రాగానే దేశ వ్యాప్తంగా ఉన్న సోనూ అభిమానులు కోట్లాది మంది ఆవేదన చెందారు. కొందరైతే ‘దేవుడికి కూడా కరోనా వస్తుందా?’ అంటూ ఆందోళన వ్యక్తం…
సోనూ సూద్… ఈ పేరు ఇప్పుడు ఓ బ్రాండ్ గా మారిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనా తర్వాత రియల్ లైఫ్ హీరోగా మారిన ఈ రీల్ లైఫ్ విలన్ మానవతా వాదిగా పేరు తెచ్చుకున్నారు. చిన్న, పెద్దా… రాజు, పేద తేడా లేకుండా అడిగిన వారందరికీ సాయం చేస్తూ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నాడు సోనూసూద్. కొవిడ్ ఆరంభంలో ఆయన మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నాడు. తనలో ఉన్న భిన్న…
మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో స్టార్ హీరో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్ళడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా అదే ఫీట్ ను ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూసూద్ చేశాడు. అయితే దీనికి కారణం వేరు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ స్పాట్ కు పొద్దున్నే వెళ్ళాల్సి రావడంతో సోనూసూద్ సైకిల్ మీద వెళ్ళిపోయాడట. సైక్లింగ్ అంటే ఇష్టమైన సోనూ… పొద్దునపొద్దునే ఇటు వ్యాయామంతో పాటు అటు ప్రయాణం కూడా చేసేశాడన్న మాట!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు మరో అరుదైన గౌరవం లభించింది. పంజాబ్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ను నియమించింది పంజాబ్ ప్రభుత్వం. ఈ మేరకు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు. “నటుడు సోనూసూద్ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ విషయం ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన సపోర్ట్ కు ధన్యవాదాలు. ప్రతి ఒక్క పంజాబీ కరోనా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి.…