Congress MLA Seethakka Fired on China Jeeyar Swamy. ఇటీవల ఆథ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. చిన జీయర్ స్వామి ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క సారక్క ను అవమానించేలా మాట్లాడారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. దేవతల మీద దుర్మార్గంగా మాట్లాడారని, దీనిపై సీఎం స్పందించకపోవడం బాధాకరం..స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. పేదల ఇళ్లకు వంద గజాల…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి… అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సైతం చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు రాకపోవడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసే అంశం కాగా… బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది.. ఇక, ఈ ఫలితాలను సీరియస్‌గా తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీ రాజీనామాకు సిద్ధపడ్డారు.. కాంగ్రెస్ పార్టీ కోసం అవసరమైతే ఏ త్యాగానికైనా సిద్ధమని ప్రటించారు. రాజీనామా…
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కని విని ఎరుగని ఘోర పరాజయం చవిచూసింది. అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోవటం హస్తం పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఈ ఘోర ఓటమి పార్టీలో తీవ్ర అసంతృప్తి మిగిల్చింది. కొంత కాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న నేతలకు ఇది నైతిక బలం ఇస్తుందనటంలో సందేహం లేదు. తాజా ఎన్నికల పరాభవానికి కారణాలు, పరిస్థితులపై పార్టీ అత్యున్నత నిర్ణయాక కమిటీ సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా సమావేశమైంది.…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, నాయకత్వ మార్పు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఇవాళ సమావేశమైన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ… ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ తాము రాజీనామాకు సిద్ధమన్న ఆమె ప్రతిపాదనను సమావేశం ఏకగ్రీవంగా తిరస్కరించింది.. ఇక, ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా.. పార్టీ కోసం గాంధీ కుటుంబం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం అని ప్రకటించారు.. వ్యక్తుల కన్నా పార్టీయే ముఖ్యం అని స్పష్టం చేసిన ఆమె..…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కూడా పార్టీ పదవులకు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది.. దానికి అనుగుణంగానే ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో రాజీనామాకు సిద్ధమయ్యారు సోనియా గాంధీ… సీడబ్ల్యూసీ సమావేశం కోరితే పార్టీ పదవులకు రాజీనామా చేసిందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు సోనియా గాంధీ.. అయితే, సోనియా గాంధీ ప్రతిపాదనను ఏకగ్రీవంగా తిరస్కరించింది సీడబ్ల్యూసీ సమావేశం. Read Also:…
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఓటములు తప్పడంలేదు.. ఇక, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీని ఖంగుతినిపించాయి.. ఐదుకు ఐదు రాష్ట్రాల్లోనూ ఘోర పరాభవం ఎదురైంది.. మరోవైపు జీ23 నేతల నుంచి ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో సంచలన విషయాలు తెరపైకి వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా రాజీనామా చేయనున్నట్టు ప్రచారం సాగుతోంది.. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ ఓటమికి తమదే బాధ్యత అంటూ రాజీనామాలు…
CWC Meeting Tomorrow at Delhi. దేశంలో ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఫలితాల విడుదలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలైంది. మిగిలిన 4 రాష్ట్రాల విషయాన్ని పక్కనపెడితే.. తన పాలనలో ఉన్న పంజాబ్‌లో సైతం ఆ పార్టీకి ఘోర పరాభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది.. పంజాబ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఏ మాత్రం గట్టిపోటీ ఇవ్వలేని పరిస్థితి.. దిగ్గజాలు సైతం ఓటమిపాలయ్యారు. ఇక, మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా.. కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. కర్ణాటకకు చెందిన కీలక నేత, ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం.. పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. తాను వెంటనే పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలో…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతానంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పుడు పార్టీ సీనియర్ నాయకుల బుజ్జగించి ఆయన రాజీనామా చేయకుండా అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదని, పార్టీకి చెందినవారే తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, అనుమానాలు నివృత్తి చేసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో…
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్, యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా “వీడియో కాన్ఫరెన్స్ ” లో ఓటర్లతో మాట్లాడిన ఆమె.. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా కీలకమైనవి.. రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు చాలా కీలకం అన్నారు.. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదన్న ఆమె… ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తప్ప ప్రభుత్వం చేసింది…