తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ.. విభేదాలు పక్కనబెట్టి.. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కలిసికట్టుగా పనిచేస్తామని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్.. మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్‌రెడ్డిలపై…
డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో…
రాహుల్ తో భేటీ కోసం ఢిల్లీ వెళ్ళిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పలు అంశాలు ప్రస్తావించారు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణా లో రైతులు, ఆందోళనలో ఉన్నారు.ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి..బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయి.. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతులపట్ల మరణశాసనం లా మారింది.కేసీఆర్ సంతకం మరణశాసనం లా…
సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి స్టయిలే వేరు. రాజకీయంగా ఎంత బిజీగా వున్నా తన పర్యటనలు మాత్రం కొనసాగిస్తూనే వుంటారు. తాజాగా ఆయన హైదరాబాద్ లోని కంది ఐఐటీ డైరెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు నిర్మల జగ్గారెడ్డి ,కుమార్తె జయరెడ్డి ,కుమారుడు భరత్ సాయి రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఐఐటీ చుట్టూ పక్కల గ్రామాలలో ఉన్న యువతతో పాటు నియోజకవర్గంలోని యువతకు ,నిరుద్యోగులకు ఉద్యోగాల పై ఐఐటీ డైరెక్టర్ తో సమావేశంలో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, అంతర్గత కుమ్ములాటలు, అసంతృప్తులతో బేజారైపోతున్న కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన చేసేందుకు ఆపార్టీ అధినేత్రి సోనియాగాంధీ సిద్దమయ్యారు. ఢిల్లీలో కీలక భేటీని ఏర్పాటు చేశారు. ఏఐసీపీ ప్రధాన కార్యాలయంలో సోనియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు అటెండ్ అవుతారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చిస్తారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై నేతల నుంచి వివరాలను తీసుకోనున్నారు సోనియా. పార్టీలో…
ఐదు రాష్ట్రాల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.. ఇదే సమయంలో.. ప్రక్షాళన ప్రారంభించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ… ఈ పరిణమాలపై ఢిల్లీలో స్పందించిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు.. సోనియా గాంధీ ప్రక్షాళన ప్రారంభించారు.. ఆమెకు నా అభినందనలు.. ఇది శుభసూచకం అన్నారు.. రేపు పార్టీ ప్రధాన కార్యదర్శులతో సోనియా సమావేశం అవుతున్నారు… తెలంగాణలోని పరిణామాలను కూడా సోనియా గాంధీ పరిగణనలోకి తీసుకోవాలని సూచించిన…
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్‌తో సీనియర్ల పంచాయితీ పాకాన పడింది. రాహుల్ గాంధీ ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పనితీరును పార్టీ విధేయులుగా చెప్పుకునే పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కన్నా తన వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకునే ఎజెండాతో రేవంత్ పనిచేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్‌లో ఇంటిపోరు కొత్త కాదు. వర్గపోరు, వర్గ భేటీలు కూడా కొత్త కాదు. అయితే నేటి రాజకీయ పరిస్థితులు మునపటిలా లేవు.…
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలు రోజుకో మలుపు తిరుగుతుంటాయి. నేతలు కీలక ప్రకటనలతో హోరెత్తిస్తూ వుంటారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఉంది. అలా అని హద్దు మీరితే అధిష్టానం ఊరుకోదు. గీత దాటితే వేటు తప్పదన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధిష్టానంకి తెలుసు. వ్యక్తిగత సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలన్నారు. పీసీసీలో ఎన్నో కమిటీలు ఉన్నాయి. ఏఐసీసీ కూడా ఉంది. ఏదైనా సమస్య ఉంటే ఏఐసీసీకి…
జీ-23 కాంగ్రెస్ అసమ్మతి నేతల వరుస భేటీలు దేశ రాజకీయాల్లో కాకరేపాయి. రెబల్స్ నేతల సమావేశాలపై హాట్‌హాట్‌గా చర్చలు, విశ్లేషణలు సాగాయి. అయితే వరుస భేటీలతో హీట్ పెంచిన సీనియర్లు మొత్తానికి చల్లబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. 10 జనపథ్‌లోని ఆమె నివాసంలో సమావేశమై గంటకు పైగా పలు కీలక అంశాలపై చర్చించారు. సోనియాతో ముఖ్యంగా ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆజాద్…
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీని.. అంతర్గత విభేధాలు కూడా కలవరపెడుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న నేతలు రెబల్స్‌గా జట్టు కట్టడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది.. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది.. ఇప్పటికే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్లో రాజీనామా చేయాలని ఆదేశించింది.. మరోవైపు.. అసమ్మతి నేతల డిమాండ్లపై కూడా ఫోకస్ పెడుతున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. అందులో భాగంగా.. సోనియా గాంధీతో త్వరలోనే…