తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఎంపిక చివరి దశకు చేరుకున్నది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీని నియమించాల్సి ఉన్నా, ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని వాయిదా వేశారు. కాగా, ఈరోజు ఢిల్లీలో తెలంగాణ పీసీసీ నియామకంపై సోనియాగాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజరయ్యారు. ఏ క్షణమైనా టీపీసీసీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నది. టీపీసీసీ రేస్‌లో ఉన్న రేవంత్ రెడ్డి…
పార్టీ ఫెల్యూర్ పై చర్చ జరపాలని ఇంచార్జ్ మాన్నికమ్, సోనియా గాంధీకి లేఖ రాసారు వీ.హనుమంతరావు. అందులో అధినేత్రి ముందు ఇల్లు చక్కదిద్దుకోవలని చెప్పారు. కానీ తెలంగాణ పార్టీ మాత్రం పట్టించుకోవడంలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి వరుస ఎన్నికల్లో పార్టీ ఓడిపోతున్న రివ్యూలు లేవు. నాడు కుంతియా, నేడు ఠాగూర్ రివ్యూలు చేయడం మర్చిపోయారు. పార్టీకి బిసిలు దూరం అవుతున్నారు. తెరాస ఈటల పోతే మరో బీసీ ఎల్. రమనను తీసుకుంటున్నారు. తెరాస బిసిల…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో.. ఓవైపు బ్లాక్ ఫంగస్.. మరోవైపు వైట్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి.. బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం.. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే, బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్‌తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన ఆమె.. ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ – 1897…
కరోనా ఫస్ట్ వేవ్.. ఇప్పుడు సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మహమ్మారి బారినపడి ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి.. తల్లిదండ్రులను కోల్పోయి.. చిన్నారులు అనాథలుగా మిగిలిపోయినవారు ఎంతోమంది.. అయితే, అనాథలుగా మారిన చిన్నారులకు భరోసా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. ప్రధాని లేఖ రాసిన ఆమె… అనాథలైన చిన్నారులకు ఉచిత విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని కోరారు.. ఈ విపత్కర, విషాద పరిస్థితుల్లో వారిని ఆదుకుని…
ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీ జరిగింది. వర్చువల్ విధానం ద్వారా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలపై సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధినేత్రి సోనియా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతల పనితీరుపై ఆమె మండిపడ్డారు. అదే విధంగా ఈ సమావేశంలో దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, వ్యాక్సిన్, లాక్ డౌన్ తదితర అంశాలపై కూడా చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో…