ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న కాంగ్రెస్ పార్టీని.. అంతర్గత విభేధాలు కూడా కలవరపెడుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌లో సీనియర్లుగా ఉన్న నేతలు రెబల్స్‌గా జట్టు కట్టడం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది.. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది.. ఇప్పటికే ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లో రాజీనామా చేయాలని ఆదేశించింది.. మరోవైపు.. అసమ్మతి నేతల డిమాండ్లపై కూడా ఫోకస్ పెడుతున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. అందులో భాగంగా.. సోనియా గాంధీతో త్వరలోనే భేటీకాబోతున్నారు పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్.. గాంధీ కుటుంబానికి అసమ్మతి నేతల నిశ్చితాభిప్రాయాలు, మనోవేదనను తెలియజేయనున్నారు.. సోనియా గాంధీతో ఆజాద్ జరిపే చర్చల్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు..
Read Also: AP: వంట నూనెల ధరలకు సర్కార్ బ్రేక్..!
కాంగ్రెస్ పార్టీలో “చీలిక” మనుగడ సాగించే పరిస్థితి, శక్తి పార్టీకి లేదనే అంశం అసమ్మతి నేతల సమావేశంలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.. గాంధీ కుటుంబం చుట్టూ ఉన్న వీర విధేయులే పార్టీ పతనానికి కారణమంటూ నిన్న జరిగిన సమావేశంలో అభిప్రాయపడ్డారు అసమ్మతి నేతలు… వెంటనే “వీర విధేయులు”ను తొలగించాలని తిరుగుబాటుదారుల డిమాండ్ గా ఉంది.. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని “వీర విధేయులే” తప్పుదోవ పట్టించారంటూ రెబల్స్ మండిపడుతున్నారు.. కాంగ్రెస్ అధినాయకత్వం వినకపోతే, మరిన్ని విపరీత నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు అసమ్మతి నేతలు. పార్టీ అధినాయకత్వాన్ని వెనుకేసుకురావడం, విమర్శల నుంచి “రక్షణ” కలిపించడం మినహాయించి, “వీర విధేయులు” పార్టీ కి చేసింది చాలా తక్కువ అని అభిప్రాయపడ్డారు అసమ్మతి నేతలు. పైపై తాత్కాలిక మార్పులను సూచిస్తూ, అధినాయకత్వాన్ని సమర్ధించడం తప్పా, వీర విధేయులు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ అసమ్మతి నేతల అభిప్రాయంగా ఉంది.. ఐదు రాష్ట్రాల్లో ఓటమికి ఎవరైతే కారణమో, తిరిగి వారికే పరిష్కార మార్గాల చూపాలంటూ బాధ్యతలు అప్పగించారంటూ మండిపడ్డారు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను అంచనా వేసేందుకు, సంస్థాగత మార్పులను సూచించేందుకు ఐదుగురు నేతలకు బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ.. జైరామ్ రమేష్ కు మణిపూర్, జితేంద్ర సింగ్ కు ఉత్తర్ ప్రదేశ్, అజయ్ మెకన్ కు పంజాబ్, అవినాష్ పాండే కు ఉత్తరాఖండ్, రజనీ పాటిల్ కు గోవా బాధ్యతలు అప్పగించారు.. వారినే తప్పుబడుతున్నారు రెబల్స్. గాంధీ కుటుంబేతరులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలని నేరుగా చెప్పడం ఒక్కటే తక్కువగా ఉన్నట్టు పరిస్థితి ఉంది.. ఇతర అన్ని అంశాలలో నిక్కచ్చిగా పూర్తి ప్రక్షాళన చేపట్టాలని కోరుతున్న కాంగ్రెస్ అసమ్మతి నేతలు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో జరగున్న ఆజాద్ భేటీలో ఎలాంటి చర్చ సాగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.