2010లో సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ రికార్డు నెలకొల్పారు. అయితే అధ్యక్షురాలిగా ఆమె ప్రయాణం అక్కడే ఆగలేదు. మరో ఏడేళ్లు కంటిన్యూ అయింది. అంటే వరసగా 19 ఏళ్లు ఆమె కాంగ్రెస్ అధినేత్రిగా పార్టీని నడిపారు. తిరిగి 2019లో తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించాల్సి వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ -ఈ నలుగురూ కలపి పార్టీని ఎన్నేళ్లు నడిపించారో..సోనియా గాంధీ ఒక్కరే దాదాపు అన్నేళ్లు సారధ్యం…
పంజాబ్ లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రారంభించింది. పార్టీలో అంతర్గత సమస్యతను పక్కన పెట్టి ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ కాంగ్రెస అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను లేఖలో పేర్కొన్నారు. ఈ పాయింట్ల ఆధారంగా మ్యానిఫెస్టోను రూపొందించేందుకు సమయం కావాలని కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి…
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. సమావేశంలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మాలను వెల్లడించారు.. ద్రవ్యోల్బణం, రైతాంగ సమస్యలు, రైతులపై జరుగుతున్న దాడులపై, తాజా రాజకీయ పరిస్థితులపై తీర్మానాలు చేసింది సీడబ్ల్యూసీ.. సంస్థాగత ఎన్నికల షెడ్యూల్ ను కూడా ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీలో కిందిస్థాయి…
ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైంది.. 2022 సెప్టెంబర్ నెలలో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.. నవంబర్ 1వ తేదీ నుంచి సత్యభత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమై 2022 ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగనుంది.. అయితే, ఈ సమావేశంలో తిరిగి ఏఐసీసీ బాధ్యతలు స్వీకరించాలని రాహుల్ గాంధీని కోరారు.. మరోవైపు.. తాను కాంగ్రెస్కు తాత్కాలిక అధ్యక్షురాలిగా లేనని.. పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నానని సోనియా గాంధీ స్పష్టం చేశారు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే…
కాంగ్రెస్ పార్టీకి అసలు అధ్యక్షుడు ఎవరు? కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకుంటారు.. ఎన్నిక విధానం మారాలి అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో కొంత కాలంగా చర్చ సాగుతోంది.. దీనిపై జీ -23 టీమ్ బహిరంగంగానే పార్టీని టార్గెట్ చేసింది.. అయితే, ఇవాళ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సీరియస్గా స్పందించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించే ప్రయత్నం చేస్తూ..…
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన జరుగుతోన్న ఈ భేటీలో వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి.. పార్టీ సంస్థాగత ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, లఖింపూర్ ఖేరీ ఘటనపై చర్చిస్తున్నట్టు తెలుస్తుండగా.. ఈ సమావేశంలో 23 మంది అసమ్మతి నేతలకు సోనియా గాంధీ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే సహించేది లేదని 23 మంది అసమ్మతి నేతలకు…
కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీలు.. గాంధీలంటే కాంగ్రెస్ పార్టీ గుర్తుకొస్తుంది. ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉంది. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ చేజారిపోతే ఆపార్టీ బ్రతికి బట్టకట్టదనే ప్రచారం ఉంది. ఈ కారణంతోనే సోనియాగాంధీ ఎంత కష్టమైనా అధ్యక్ష బాధ్యతలను తానే మోస్తున్నారు. ఒక్కసారి అధ్యక్ష పీఠం చేజారితే ఏం జరుగుతుందో సోనియాగాంధీకి తెలుసు. అందుకే ఆమె అధ్యక్ష బాధ్యతలను ఇతరులకు కట్టబెట్టేందుకు సుముఖతను వ్యక్తం చేయడం లేదు. ఇస్తేగిస్తే గాంధీ కుటుంబంలోని వారికేనని…
కాంగ్రెస్లో మళ్లీ కలకలం.. హస్తం పార్టీలో అలజడి కొత్త కాదు. కానీ, కొద్ది రోజుల క్రితం కపిల్ సిబల్ చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు ఎవరంటూ ఆయన ప్రశ్నించటమే తాజా సంక్షోభానికి కారణం. నాయకత్వాన్ని ప్రశ్నించటం కార్యకర్తలకు నచ్చలేదు. సిబల్ ఇంటి మీద పడ్డారు. గొడవ గొడవ చేశారు. ఇదంతా కావాలనే చేయించారని సిబాల్ బృందం అంటోంది. దాంతో వారు నాయకత్వంతో తాడో పేడో తేల్చుకుంటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్లో చోటుచేసుకున్న పరిణామాల పట్ల…
త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండగా పంజాబ్ లో మాత్రం కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో ఈ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా కాంగ్రెస్ అధిష్టానం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. అయితే ఆపార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కాంగ్రెస్ కు అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా మారుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అధిష్టానం ఒకటి తలిస్తే మరొకటి జరుగుతుండటంతో నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్…
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ను చైర్మన్గా నియమించారు. జాతీయ స్థాయిలో పోరాటాలకు ప్రణాళికలను రూపోందించే ఈ కమిటీలో ప్రియాంక గాంధీ, ఉత్తమ్కుమార్ రెడ్డి, మనీశ్ ఛత్రత్, బీకే హరిప్రసాద్, రిపున్ బోరా, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబిర్ ఖాన్ లు సభ్యులుగా ఉండబోతున్నారు. దేశంలోని…