జమ్మూ కాశ్మీర్లో జరిగే ఎన్నికలకు 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కాంగ్రెస్ (INC) ఇవాళ (శనివారం) విడుదల చేసింది. ఐదు దశల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ఈ నేతలు జమ్మూ కాశ్మీర్లో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు.
DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకలోని గుల్బార్గా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీ చేస్తారు.. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో కూడా పేరు చేర్చినట్లు తెలిసింది.
Priyanka Gandhi: లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్-మేలో ఎన్నికలు పూర్తి అవనున్నాయి. ఇప్పటికే బీజేపీ 192 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ విషయం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ ఇస్తోంది. కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంకాగాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీకి…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇండియా కూటమిపై మాటలతో దాడి చేసారు. మహారాష్ట్రలోని జలగావ్లో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. సోనియా గాంధీ చేపట్టిన ‘రాహుల్ యాన్’ ప్రయోగం 19 సార్లు ఘోరంగా విఫలమైందని, 20వ ప్రయత్నానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాయ్బరేలీ స్థానం నుంచి లోక్సభకు 6 పర్యాయాలు పూర్తి చేసిన సోనియా గాంధీ.. తొలిసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. సోనియా గాంధీ ఫిబ్రవరి 15న రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు.. ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజస్థాన్ నుంచి సోనియా గాంధీతో పాటు.. బీజేపీకి చెందిన చున్నిలాల్ గరాసియా, మదన్ రాథోడ్…
ప్రియాంకాగాంధీ (Priyanka Gandhi).. అచ్చం వాళ్ల నాయనమ్మ ఇందిరాగాంధీని పోలి ఉంటారు. ఆమెను చూసిన కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇందిరానే ఊహించుకుంటారు. ఇకపోతే ప్రియాంక ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారే తప్ప ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేదు. ఈసారి మాత్రం