DK Shivakumar: దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగం సోనియాగాంధీ చేశారు.. కాంగ్రెస్‌తోనే దేశం ఐక్యంగా ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: కాంగ్రెస్ అధినేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రధాన మంత్రి పదవుల్ని త్యాగం చేశారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచడం గాంధీ కుటుంబానికి మాత్రమే సాధ్యమని ఆయన మంగళవారం అన్నారు. కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో 2004లో సోనియాగాంధీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని చెప్పారు.
యూపీఏతో సంబంధం లేకుండా ఎంపీలంతా ఆమెను ప్రధాని చేయాలని కోరారని, అయితే ఆమె మన్మోహన్ సింగ్‌ని ప్రధాని చేసిందని, యూపీఏ మొత్తం ఆమె ప్రధాని కావాలని కోరుకున్నప్పటికీ, ఒక ఆర్థికవేత్త కోసం త్యాగం చేశారని అన్నారు. ఒక మహిళ ప్రధాని అయ్యే అవకాశాన్ని వదులుకుని దేశం కోసం మన్మోహన్ సింగ్‌ని నామినేట్ చేశారని, అది దేశ చరిత్రలోనే అతిపెద్ద త్యాగమని, అది గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగమని డీకే శివకుమార్ అన్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Kerala BJP: “మతం పేరుతో ప్రచారం”.. కేరళ సీఎంపై ఈసీకి బీజేపీ లేఖ..
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ఇలాంటి త్యాగం చేస్తారా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. పార్లమెంట్ సభ్యులే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ పోరాడుతోందని అన్నారు. రాహుల్ గాంధీ దేశం కోసం పోరాడుతున్నారని, అతను నడిచినంత దూరం దేశంలో ఏ నేత నడవలేదని కొనియాడారు. మన్మోహన్ సింగ్ తర్వాత ప్రధానిగా రాహుల్ గాంధీ కావచ్చు, కానీ ఆయన ఎప్పుడూ అధికారం వైపు చూడలేదని, పార్టీ అధికారంలో ఉండాలని కోరుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని గాంధీ కుటుంబం మాత్రమే ఐక్యంగా ఉంచగలదని, కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉన్నప్పుడే దేశం సమైక్యంగా ఉంటుందని, ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అతిపెద్ద బలమని, ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచిందని ఆయన అన్నారు.
2004లో ‘ఇండియా షైనింగ్’ అనే నినాదంతో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. ఆ ఎన్నికల్లో బీజేపీకి 138 సీట్లు రాగా.. కాంగ్రెస్ 145, సీపీఎం 43, ఎస్పీ 43, ఆర్జేడీ 24 సీట్లను గెలుచుకున్నారు. యూపీఏ నేతృత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. 2009లో మరోసారి యూపీఏ అదికారంలోకి వచ్చింది. ప్రస్తుతం 543 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎన్నికలు జరగబోతున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!