ఉత్తరప్రదేశ్‌లో రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాహుల్ వెంట సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, తదితరులు ఉన్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న ముగిసింది. ఇక సెకండ్ విడత ఓటింగ్ శుక్రవారమే జరగనుంది. ఇందుకోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.
PM Modi: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘ ఎన్నికల్లో గెలవలేని వారు, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులు అయ్యారు.’’ అని అన్నారు.
Congress: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వలసలు పెరిగాయి. సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ జరిగిన మరుసటి రోజే పలువురు కీలక నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.
రాజ్యసభ సభ్యురాలుగా తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ప్రమాణస్వీకారం చేశారు. సోనియా గాంధీ చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రమాణం స్వీకారం చేయించారు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ ఏకగ్రీవంగా రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా సోనియాగాంధీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. Also read:…
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఆదివారం నాగు జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్ భార్యలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ కలిశారు. ఈ సందర్భంగా తన భర్త హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విధానాన్ని సోనియాకు వివరించారు.