కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభకు కాకుండా రాజ్యసభకు వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇద్దరు మాజీ ప్రధానులు పీవీ.నరసింహారావు (PV Narasimha Rao), చరణ్ సింగ్ (Charan Singh), ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు.. తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ఇప్పటికే పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి..
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 30న బిహార్‌లో ప్రవేశించనుంది. ఈ యాత్రలో పాల్గొనవల్సిందిగా ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను కాంగ్రెస్ ఆహ్వానించింది. ఇదే విషయాన్ని గుర్తుచేసేందుకు నితీష్‌కుమార్‌కు సోనియాగాంధీ ఫోన్ చేశారని సమాచారం.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పేరుతో ప్రజా పాలన అభయహస్తం కోసం దరఖాస్తు చేశారు. ఈ ఫాంలో కొడుకులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ల పేర్లు రాసి ఉంచారు. ఇక, కూతురుగా కొండా సురేఖ, అల్లుడుగా శ్రీధర్ బాబు పేర్లు రాసి ప్రజాపాలనలో అభయహస్తంకు సదరు ఆకతాయిలు దరఖాస్తు ఇచ్చారు. ప్రస్తుతం ఈ దరఖాస్తుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా బాయ్ మరియు కిసీ కా జాన్.. వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్…
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని మన రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరినమని, సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయవద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని, బీఆర్ఎస్ పార్టీకి కాలేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి…
ఆప్ రాజ్యసభ ఎంపీగా ఢిల్లీ ఉమెన్ ప్యానెల్ చీఫ్ నామినేట్.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జనవరి 19న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్‌ను తన అభ్యర్థిగా నామినేట్ చేసింది. ఈమెతో పాటు రెండోసారి సంజయ్ సిగ్, ఎన్డీ గుప్తాలను నామినేట్ చేసింది. ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)ఈ రోజు నామినేషన్లను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ) చీఫ్‌గా ఉన్న స్వాతిమలివాల్ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ముఖ్యమంత్రి అరవింద్…
YS Sharmila: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్‌లో చేరారు. ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.