జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వ్యూహం' చిత్రం మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ చిత్రంపై నారా లోకేశ్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. వ్యూహం సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వద్దని ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. కాసేపటి క్రితమే సీఎం ఢిల్లీలోని ఆమె నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీతో భేటీ అయిన రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై ఆమెతో చర్చించినట్టు సమాచారం. అలాగే ప్రధాని మోడీతో భేటీ గురించి సోనియా గాంధీకి వివరించనున్నట్టు సమాచారం. Also Read: Bhatti Vikramarka: ప్రధానితో భేటీ.. తెలంగాణకు రావాల్సిన నిధులపై చర్చించాం కాగా…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతి పక్ష పార్టీలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత సోనియా గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
గాంధీభవన్లో పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ అధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఏసీ కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం పార్లమెంటు ఎన్నికలు, ఇతర కీలక అంశాలపై పీఏసీ చర్చించి నిర్ణయించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని తీర్మానించినట్టు పీఏసీ పేర్కొంది. Also Read: Big Shock: నల్లగొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు బిగ్ షాక్ పీఏసీ…
Congress: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో మెగా ర్యాలీ జరగనుంది. డిసెంబర్ 28న జరిగే ఈ మెగా ర్యాలీకి 10 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు హాజరుకానున్నారు.
Sonia Gandhi Birthday: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు పండుగ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె పుట్టిన రోజునే ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేశారని గుర్తు చేశారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పుట్టినరోజు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోనియా గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోడీ సోనియా గాంధీకి ట్విట్టర్ వేదికగా విషెస్ చెప్పారు.