ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ఏం చేసిందన్న దానిపై.. మేము చర్చకు సిద్ధమని సవాల్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుకు మేం (కేంద్ర ప్రభుత్వం) బాకీలేము… ఆ ప్రాజెక్టును భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.. పోలవరాన్ని కేంద్రం కట్టించి ఉంటే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తయ్యేది.. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని ఆరోపించారు సోమువీర్రాజు… ఇక, ఈ సమయానికే పోలవరం పూర్తి అయిఉంటే మిగులు జలాలతో…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక కౌంటింగ్ పూర్తయ్యింది. ఈ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌కు 19,332 ఓట్లు పడ్డాయి. అయితే ఆత్మకూరు ఉపఎన్నికలో నైతిక విజయం తమదేనని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వీరోచిత పోరాటం చేసిందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో…
సోము వీర్రాజు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు. గతంలో ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగుపెట్టారు. ఈసారి మాత్రం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లెక్కలు వేస్తున్నారట. అందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట వీర్రాజు. ఆయన సొంతూరు కాతేరు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉంటుంది. అయితే ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. ఒకవేళ అధిష్ఠానం అసెంబ్లీకి పోటీ చేయమంటే రాజమండ్రి అర్బన్ నుంచి బరిలో దిగాలని లెక్కలేస్తున్నారట. దానికి…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఇవ్వాళ్టితో ఉప ఎన్నిక ప్రచార ఘట్టానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి కోసం ఆపార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆత్మకూరు లో బీజేపీ భారీ రోడ్ షో నిర్వహించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాట్లాడుతూ.. ఆత్మకూరు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక్కడ రోడ్లు గుంతలు చూడలేక మంత్రులు నల్ల కళ్ళద్దాలతో వస్తున్నారు. మంత్రులు రోజా ,అంబటి తదితర మంత్రులు నల్ల కళ్ళద్దాలతో తిరుగుతున్నారు.…
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రైతు సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు.…
కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆర్మీ అభ్యర్థులు నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.. అయితే, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ధ్వంస రచన ఒక పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అగ్నిపథ సాకు మాత్రమే.. ధ్వంసం వారి లక్ష్యంగా పేర్కొన్న ఆయన.. విదేశీ శక్తులతో పాటు ఇక్కడ ఉన్న కొన్నివర్గాలు కలిపి చేస్తున్న విధ్వంసమే ఇది అని విమర్శించారు.. మీడియా…
కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై ఆందోళన వద్దన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. రైల్వే అస్తులు విధ్వంసం వెనుక కుట్ర వుందన్నారు. అగ్నిపథ్ పధకం యువతకు చాలా ఉపయోగకరమనే విషయాలు తెలియని యువత అవేశాలకు లోనవుతున్నారు. సికింద్రాబాద్ వంటి రైల్వే స్టేషన్లో విధ్వంసం సృష్టించిన వారు సంఘ విద్రోహులుగా అనుమానాలు కలుగుతున్నాయి. భారత సైన్యంలో చేరాలని కలలు కంటున్న యవతకు అగ్నిపథ్ ఒక సువర్ణావకాశం లాంటిది. సంఘ విద్రోహ శక్తులతో ప్రధాని పై వ్యతిరేక ప్రచారం…