పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్.. రాప్తాడులో టెన్షన్ టెన్షన్..!
వైఎస్‌ఆర్ కాంగ్రెస పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన.. ఇప్పుడు రాప్తాడు నియోజకవర్గంలో కాకరేపుతోంది.. ఇటీవల దారుణ హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు శ్రీసత్యసాయి జిల్లాకు వెళ్లారు జగన్.. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలోని పాపిరెడ్డిపల్లిలో గత నెల 30వ తేదీన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబంపై దాడి చేశారు.. ఈ ఘటనలో లింగమయ్య తీవ్రగాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.. ఈ ఘటన రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్‌ను పెంచింది..
నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా.. మహిళలకు హోంమంత్రి క్షమాపణ
బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో లైంగిక వేధింపులు సాధారణమేనంటూ కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నతమైన స్థాయిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటి? అని పలువురు మహిళలు నిలదీశారు.
తాజాగా ఇదే అంశంపై హోంమంత్రి స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. మహిళల భద్రత గురించి ఆలోచించే వ్యక్తిని.. నిర్భయ నిధులను సక్రమంగా ఉపయోగిస్తున్నామని.. అలాంటిది తప్పుడు ప్రకటనలు ఎందుకు చేస్తానన్నారు. అయినా కూడా తన వ్యాఖ్యల వల్ల ఏ మహిళ అయినా బాధ పడుంటే విచారం వ్యక్తం చేస్తున్నాను. స్త్రీ సమాజం క్షమించాలని కోరుతున్నానన్నారు.
బెంగళూరులో గత వారం ఇద్దరు యువతులు వీధిలో వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన యువకుడు అసభ్యకరంగా తాకి లైంగికంగా వేధించి పరారయ్యాడు. అయితే ఈ ఘటనతో అమ్మాయిలిద్దరూ షాక్‌కు గురయ్యారు. భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శ.. సర్కార్‌పై సంచలన ఆరోపణలు..
రాప్తాడు నియోజకవర్గం పాపిరెడ్డిపల్లికి వెళ్లిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. ఇటీవల హత్యకు గురైన వైసీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.. అసలు ఏం జరిగింది.. ఎంత మంది వచ్చారు.. ఎవరెవరిపై దాడి చేశారు.. లాంటి విషయాలపై ఆరా తీశారు.. లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చారు.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లింగమయ్య కుటుంబానికి భరోసా ఇచ్చారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ జగన్.. రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయన్న ఆయన.. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతిభద్రతలు దిగజారాయి.. మొత్తం రెడ్‌బుక్ పరిపాలన నడుస్తోందని మండిపడ్డా.. చంద్రబాబు ఎంత భయపెట్టినా.. ప్రలోభాలు పెట్టినా ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది.. అయితే, వైసీపీ గెలిచినచోట్ల చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్
అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో నిన్న, నేడు పర్యటిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయి రోడ్ల అభివృద్ధికి పవన్ చొరవతో అడుగులు పడుతున్నాయి. కాగా ఈ పర్యటనలో వాలంటీర్లు పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా వాలంటీర్ వ్యవస్థపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “మీరు ఏ విభాగం కిందకు వస్తారో.. జీతాలు ఎలా ఇచ్చారో చెప్పకుండానే వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని వంచించిందని చెప్పారు.
వల్లభనేని వంశీకి మరో షాక్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది.. వంశీ రిమాండ్‌ను మళ్లీ పొడిగించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసిన సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. వల్లభనేని వంశీతో సహా ఐదుగురు నిందితులకు రిమాండ్ ఈ నెల 22 వరకు పొడిగించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు.. ఇదే కేసులో వంశీ ప్రధాన అనుచరుడు రంగాపై పీటీ వారెంట్ దాఖలు చేయగా.. అనుమతి ఇచ్చింది కోర్టు.. రంగాకు ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది.. కాగా, సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో.. ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు.. విజయవాడ తరలించిన విషయం విదితమే కాగా.. ఈ అరెస్ట్ తర్వాత.. వంశీపై మరికొన్ని కేసులు కూడా నమోదు అయ్యాయి..
జగన్‌పై పరిటాల సునీత కౌంటర్ ఎటాక్.. ప్రమాణానికి సిద్ధమా..?
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లికి వెళ్లినే మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. అయితే, వైఎస్ జగన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. అసలు జగన్ పరామర్శకు వచ్చాడా..? ఎన్నికల ప్రచారానికి వచ్చాడా..? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.. చావు ఇంటికి వచ్చి జేజేలు కొట్టించుకుంటున్నాడు.. నీ చుట్టూ ఉన్న వాళ్లు ఆ కుటుంబాన్ని చూసి నవ్వుతున్నారు.. నవ్వు నవ్వుతున్నావో.. ఏడుస్తున్నావో అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు.. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ కాదంట..!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి సంచలనం రేపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను (AI) ప్రమాదకరమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో, ఆమె దానిపై కౌంటర్ ఇచ్చారు. “AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు… అనుముల ఇంటెలిజెన్స్!” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కవిత, ఈ ‘అనుముల ఇంటెలిజెన్స్’ వల్లే రాష్ట్రానికి ముప్పు ఏర్పడిందని తీవ్ర విమర్శలు చేశారు. అనుముల ఇంటెలిజెన్స్ రాజ్యంలో విధ్వంసాన్ని సృష్టిస్తోందని, అది పక్కకు జరగకుండా రాష్ట్రానికి మంచి జరగదని తేల్చేశారు.
ఆమె బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతూ, అనుముల ఇంటెలిజెన్స్‌ను వాడి కులగణనను తప్పుదారి పట్టించారంటూ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టిందని గుర్తుచేస్తూ, అదే ధైర్యం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, 2011లో యూపీఏ ప్రభుత్వం కులగణన చేసినప్పటికీ ఇప్పటికీ వివరాలు బయటకు రాలేదని, బీజేపీ అయితే బీసీ కులగణన చేయబోమని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధిక దీక్షకైనా సిద్ధమన్నారు.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సంకేతాలు
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (RTC)లో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్నాయి. కార్మికులు, ఉద్యోగులు గత కొంతకాలంగా తమ డిమాండ్ల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, అధికార యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు సమ్మె నోటీసులు ఇచ్చిన RTC JAC, తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి సమ్మె మార్గాన్ని ఎంచుకోవడానికి సిద్ధమవుతోంది.
ఆర్టీసీ యాజమాన్యం తమ సమస్యలపై చర్చలు జరిపేందుకు ముందుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. లేబర్ కమిషనర్‌తో చర్చలు జరిపే అవకాశం కల్పించినా, ఆర్టీసీ యాజమాన్యం అందులో పాల్గొనకపోవడంతో చర్చలు జరగకుండానే RTC JAC నేతలు వెనుదిరిగారు. ఇది ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపే వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ కలిసి పని చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులుగా కనిపిస్తున్నా, వాస్తవానికి వీరి మధ్య రహస్య ఒప్పందం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ జాన్ జబ్బలు అని, ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కేటీఆర్ జైలుకు వెళ్లకుండా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నది రేవంత్ రెడ్డి అని బండి సంజయ్ ఆరోపించారు. చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ మీటింగ్‌కు ఇద్దరూ కలిసి వెళ్లిన దానికి ఇదే నిదర్శనమన్నారు. అంతేకాదు, హైదరాబాద్‌లో జరగబోయే సమావేశాన్ని కూడా ఇద్దరూ కలిసి ప్లాన్ చేస్తున్నారని, వీరిద్దరూ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారని తెలిపారు.
విద్యారంగ పునర్నిర్మాణానికి మొదటి అడుగు
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పునర్నిర్మాణం వైపు ప్రజా ప్రభుత్వం బలమైన అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ట్వీట్టర్ వేదికగా ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేసినట్టు తెలిపారు. ఈ ప్రక్రియను 15 సంవత్సరాల పాటు నిర్వహించకపోవడం నిజంగా షాకింగ్ అని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వ పాలనలో విద్య రంగం పట్ల చూపిన నిర్లక్ష్యం పేద బిడ్డల భవిష్యత్‌ను దెబ్బతీసిందని సీఎం విమర్శించారు. ఇది క్షమించలేని నేరమని ఆయన పేర్కొన్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైన తీరు రాష్ట్రం అభివృద్ధికి అడ్డు త్రాసిందని చెప్పారు. ఈ మేరకు జరిగిన పొరపాట్లను గుర్తిస్తూ, సరిచేస్తూ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో గల ఖాళీలను నింపుతూ, నాణ్యతగల బోధనకు అవసరమైన మానవ వనరులను సమకూర్చే దిశగా ఈ చర్యలు ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు.
మంత్రి పదవిపై సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు… 2014లోనే..!
మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. ఈ మధ్యే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసి.. తొలిసారి రాజమండ్రి వచ్చిన సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది.. అయితే, తనకు మంత్రి కావాలని లేదు.. మంత్రి కావాలని అనుకుంటే 2014లోనే అయ్యే వాడిని అని స్పష్టం చేశారు.. నా జీవితానికి ఇది చాలు.. బీజేపీలో కమిట్మెంట్ తో పని చేశా అని తెలిపారు.. దేశంలో దుమ్మున్న మొగవాడు ప్రధాని నరేంద్ర మోడీ అని ప్రశంసించారు.. కూటమిలో కలవడానికి కారణం రాజకీయ వ్యూహం ఉంది.. అంతేకాదు.. త్వరలో తమిళనాడులోనే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఇక, ఆక్వా రైతులు సమస్యలు పరిష్కారించాలని కోరారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు..