Marriage Incentive Scheme: తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ దివ్యాంగుల వివాహ ప్రోత్సాహ పథకం కేవలం ఒకరు దివ్యాంగులుగా ఉన్న జంటలకే వర్తించేది. అయితే, ఈ పథకం పరిమితిని విస్తరించేందుకు ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. Read Also: HUAWEI nova 14 Series: శాటిలైట్ కమ్యూనికేషన్, ఫ్లాగ్‌షిప్…
CS Ramakrishna Rao: నేడు (మే 13) సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు అధ్యక్షతన రాష్ట్రంలోని ప్రభుత్వ సాంఘిక, గిరిజన, మైనారిటీ వసతి గృహాల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్రంలోని వివిధ సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ వసతి గృహాలలో మెరుగైన సేవలు అందించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు సీఎస్ రామకృష్ణారావు. విద్యార్ధులకు అందించే కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపులను నేరుగా విద్యార్ధుల బ్యాంక్ అకౌంట్…
Merugu Nagarjuna : ఏపీలో చదువులమ్మ తల్లిని చంద్రబాబు అటకెక్కిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చదువుకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా… అమ్మ ఒడి ద్వారా ప్రతీ తల్లి ఖాతాలో 15 వేల రూపాయలు జమచేశారని, ఏపీలో గొప్ప సంస్కరణలకు జగన్ ఆధ్యుడని ఆయన తెలిపారు. చంద్రబాబు అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా పేరుమార్చారని, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ 15…
తెలంగాణ ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్-కమిటీ తుది సమావేశానికి అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చట్టం యొక్క విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి నాడు జారీ చేయబడుతుందని అన్నారు. జీఓ యొక్క మొదటి కాపీని ముఖ్యమంత్రి ఎ…
Bhatti Vikramarka : రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సమగ్ర కుటుంబ సర్వే పై అసెంబ్లీలో లెక్కలతో సహా సీఎం సభ దృష్టికి తెచ్చారని, అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సలహాలు సూచనలు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే సహేతుకంగా, స్పష్టంగా చేశామని ఆయన పేర్కొన్నారు. 3.1శాతం మంది మాత్రమే ఇంటి యజమానులు సర్వేలో పాల్గొనలేదన్నారు. కొద్దిమంది ఇంటికి…
కూటమి ప్రభుత్వం అర్హత కలిగిన పేదలకు ఇళ్ళు ఇవ్వడానికి కట్టుబడి ఉందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత ప్రభుత్వం క్షమశిక్షణ లేని ఆర్ధిక ప్రణాళికల వల్ల హౌసింగ్ ప్రోగ్రామ్ కుంటుపడిందని ఆరోపించారు.
Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ…
ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ…