ప్రభుత్వం, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు అధికారులను శనివారం సాయంత్రం లోగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ లేదా ప్రత్యేక అధికారిని చైర్మన్‌గా నియమించనున్నారు. కమిటీలో ఇద్దరు స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు, ముగ్గురు పురుషులు సభ్యులుగా ఉంటారు. ఇందులో ఒకరు బీసీ, మరొకరు ఎస్సీ లేదా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు తప్పనిసరిగా ఉండాలి. ఈ కమిటీకి పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మునిసిపాలిటీల్లో కమిటీల వ్యవస్థ కూడా అదే తరహాలో ఉంటుంది. వార్డు ఆఫీసర్ చైర్మన్‌గా పనిచేస్తారు. ఇక్కడ కూడా సభ్యులు, బీసీ , ఎస్సీ సామాజిక వర్గాలకు చెందినవారు తప్పనిసరిగా ఉండాలి.
Doraemon: చిన్నపిల్లల డోరేమాన్ వాయిస్ ఆర్టిస్ట్ ఇకలేరు.. ఒయామా కన్నుమూత
ఈ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులను ఎంపిక చేయడమే కాకుండా, సామాజిక తనిఖీలు నిర్వహించేందుకు అధికారం కలిగి ఉంటాయి. ఈ చర్య ద్వారా పేదరికాన్ని తగ్గించడం, అర్హులైన కుటుంబాలకు నాణ్యమైన నివాసం అందించడం లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి పేద, అర్హులైన కుటుంబాలకు అవసరమైన ఇళ్ల కేటాయింపు చేయడంలో మరింత సమర్థత పెరగనుందని ఆశిస్తున్నారు.
Bill Gates tribute to Ratan Tata: ‘‘ప్రపంచానికి నష్టం’’.. రతన్ టాటాకి బిల్‌గేట్స్ నివాళి..