Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్లో ఏకంగా నాలుగు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో పాటు మారుతి సినిమాకు కూడా ఇటీవల ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. వీటిలో సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభాస్ తాజాగా ఆస్పత్రిలో కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ప్రభాస్ ఆస్పత్రిలో ఐసీయూ నుంచి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో…
Ram Charan: రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాతో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పనిచేస్తున్నాడు. ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. తాజాగా రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో గుబురు గడ్డంతో, నల్ల కళ్లజోడు పెట్టుకుని చెర్రీ అద్దంలో తన అందాలను చూసుకుంటున్నాడు. ఈ లుక్‌లో రామ్‌చరణ్ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. శంకర్…
Team India: ఆసియా కప్‌లో భాగంగా సూపర్-4లో పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమికి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రధానంగా చేసిన మూడు తప్పులే కారణమని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో జట్టులోకి తీసుకున్న దీపక్ హుడా చేత బౌలింగ్ వేయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా ధారాళంగా పరుగులు ఇస్తున్నా అతడిని గుడ్డిగా నమ్మి ఫుల్ ఓవర్లు వేయించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. లెఫ్ట్ హ్యాండర్ మహ్మద్ నవాజ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో…
WikiPedia: తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఖలిస్థాన్ దేశస్థుడిగా పేర్కొన్నందుకు వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వికీపీడియా పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల సామరస్యం దెబ్బతింటుందని , అతడి కుటుంబ సభ్యులకు ముప్పు ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో వికీపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది.…
Hyderabad: హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వాహనదారులు ఇబ్బంది పడేది ట్రాఫిక్‌తోనే. ట్రాఫిక్ కారణంగా ఉద్యోగులు ఆలస్యంగా కార్యాలయాలకు వెళ్తుంటారు. ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు కూడా ట్రాఫిక్ ఇబ్బంది పెడుతుంది. ట్రాఫిక్ వల్ల కొంతమంది నరకం చూస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాల్సిన పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కంటే ఎక్కువగా ఛలానాలపైనే దృష్టి పెడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై కెమెరాలు పట్టుకుని కూర్చుని, టపాటపా ఫొటోలు తీస్తున్నారు కానీ ట్రాఫిక్…
Harikrishna Birth Anniversary: నందమూరి హరికృష్ణ 66వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ ఘనంగా నివాళులర్పించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ ట్వీట్ చేశాడు. ‘ఈ అస్తిత్వం మీరు.. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ఈ ప్రస్థానానికి నేతృత్వం మీరు.. ఆజన్మాంతం తలచుకునే అశ్రుకణం మీరే’ అంటూ ఓ ఫోటోను ఎన్టీఆర్ షేర్ చేశాడు. మరోవైపు హరికృష్ణ పెద్దకుమారుడు నందమూరి కళ్యాణ్‌రామ్ కూడా ఇదే…
Viral Video: సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు కొంచెం ఫన్‌గా ఉంటే చాలు నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఓ బైక్‌పై ఏడుగురు వెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. సాధారణంగా ఒక బైక్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించగలరు. ట్రిపుల్ రైడింగ్ చేస్తే జరిమానా ఎదుర్కోక తప్పదు. అలాంటిది ఒకే బైకుపై ఏడుగురు వెళ్లడం అంటే మాములు మాటలు కాదు. దీంతో నెటిజన్లు ఈ వీడియో చూసి ఇది బైక్ కాదని..…
Viral Video Of Live Reporting: మీడియా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా రంగంలో చాలా మంది జర్నలిస్టులు ఎన్నో సందర్భాల్లో సాహసాలు సైతం చేస్తుంటారు. తాజాగా పాకిస్తాన్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరదనీటిలో చిక్కుకున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కవర్ చేసేందుకు వెళ్లిన ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ పీకల్లోతు నీటిలో వరదలో…