NBK107: గత ఏడాది అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ NBK107 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రయూనిట్ టర్కీలో షూట్ చేస్తోంది. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో బాలకృష్ణ, రౌడీలకు మధ్య జరిగిన ఫైటింగ్ వీడియో వైరల్ అవుతోంది.
Read Also: Bigg boss 6: అందరి టార్గెట్ ఆమెనే… ఎందుకంటే..?
ఈ సన్నివేశంలో బాలయ్య ఒక రౌడీ చేతిని నరికేయగా మిగతా రౌడీలు కత్తులతో కనిపిస్తారు. బ్లాక్ షర్టులో బాలయ్య లుక్ అదుర్స్ అనేలా ఉందని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. 30 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో బాగుందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. మరి సినిమాలో ఈ సీన్ ఎక్కడ వస్తుందో కానీ థియేటర్లు దద్దరిల్లేలా చేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. బాలయ్యకు జోడీగా ఈ మూవీలో శ్రుతిహాసన్ నటిస్తోంది. అఖండ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.
From the set's of #NBK107 Turkey Action Schedule 🔥🔥🔥#GodOfMassesNBK @megopichand @shrutihaasan #JaiBalayya @NBK_Unofficial @Mokshagna_Offl @BalayyaUvasena @ALINTR9999 @NtrMaruthi9999 @Mahisiri161 @venutarak14 pic.twitter.com/8FZn7ivutf
— NTR Fans Anantapur official (@Sravant68455447) September 26, 2022