Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. చంద్రబాబు అసెంబ్లీని కాదని బామ్మర్ది షోకు వెళ్లారని ఎద్దేవా చేస్తూ మంత్రి అంబటి ట్వీట్ చేశారు. చంద్రబాబు బామ్మర్ది షోకు వెళ్లగా.. సీఎం జగన్ మాత్రం జనంలోకి వెళ్తున్నారని తన ట్వీట్లో పేర్కొన్నారు. అందుకే ‘175 అన్‌స్టాపబుల్’ అంటూ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా వైసీపీ వ్యూహారచనలు చేస్తున్న సంగతి…
New Idea: భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడటం సాధారణ విషయమే. వర్షం వస్తే ఇంటా, బయట ఏ పని పూర్తి కాదు. వర్షాలు, తుఫాన్లు వస్తున్నా అత్యవసర రంగాలకు చెందిన ఉద్యోగులు పలు జాగ్రత్తలతో పనిచేయాల్సి ఉంటుంది. తుఫాన్ కారణంగా అమెరికాలోని ఫ్లోరిడా నగరం అల్లకల్లోలంగా మారింది. నాలుగు రోజులుగా ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా జోరు వానలో, భీకర గాలిలోనూ అక్కడి పరిస్థితులను వివరించేందుకు కైలా అనే మహిళా రిపోర్టర్…
Megastar Chiranjeevi: గాంధీ జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అహింస, సత్యం, సరళమైన ఆలోచనల శక్తి వంటి పదాలకు మహాత్మాగాంధీ గొప్ప ఉదాహరణగా నిలిచిపోయారని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో కొనియాడారు. గాంధీజీ ఆదర్శాలు ఎప్పటికీ నిలిచిపోతాయని.. ఆయన ఆదర్శాలు అన్నింటినీ జయిస్తాయని చిరు పేర్కొన్నారు. కాగా చిరంజీవి ఇంకా గాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇటీవల ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డు కూడా జారీ చేసింది.…
Rahul Ramakrishna: టాలీవుడ్లో రాహుల్ రామకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ రాహుల్ రామకృష్ణ హాట్ టాపిక్ అవుతుంటాడు. తాజాగా ఈరోజు గాంధీ జయంతి కావడంతో గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు గాంధీని ఉద్దేశిస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ ఓ ట్వీట్ చేశాడు. అందులో ‘గాంధీ గొప్పవాడని నేను అనుకోను’ అని రాసుకొచ్చాడు. గాంధీ జయంతి నాడు…
NBK107: గత ఏడాది అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ NBK107 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రయూనిట్ టర్కీలో షూట్ చేస్తోంది. ఈ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చి సెల్ఫీలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.…
MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సోషల్ మీడియాలో లైవ్‌లోకి వస్తానని.. గుడ్ న్యూస్ చెప్తానని శనివారం ప్రకటించాడు. దీంతో ధోనీ చెప్పే గుడ్ న్యూస్‌పై చాలా మంది అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే ధోనీ లైవ్‌లోకి వచ్చి చెప్పిన విషయం తెలిస్తే మీరు షాకవుతారు. ఇంతకీ ధోనీ ప్రకటించిన విషయం ఏంటంటే.. ప్రముఖ బిస్కెట్ బ్రాండ్ ఓరియోను లాంచ్ చేశాడు. అయితే ఇది కమర్షియల్ ప్రకటన…
Vijayawada: దసరా పండగ సమయంలో ప్రత్యేక రైళ్లను నడపాల్సిన అధికారులు ఉన్న రైళ్లు రద్దు చేశారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ పనుల కోసం విజయవాడ మీదుగా నడిచే వందలాది రైళ్లను రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కొన్ని రైళ్లను దారి మళ్లించారని.. విజయవాడ స్టేషన్‌కు వెళ్లకుండా రాయనపాడు, రామవరప్పాడు స్టేషన్లలో కొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించారని ఓ మెసేజ్ తెగ సర్క్యులేట్ అవుతోంది. 9 9…
ఉత్తర సరిహద్దుల్లో చైనీయులతో భారత్ పోరాడుతుండగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచారనే ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి.
Death Certificate: ఎవరైనా తమ స్టడీ సర్టిఫికెట్లు పోయాయని లేదా విలువైన ఆస్తి పత్రాలు పోయాయని పేపర్లో ప్రకటన ఇస్తుంటారు. కానీ డెత్ సర్టిఫికెట్ పోయిందని ఎవరైనా ప్రకటన ఇస్తారా.. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. తన డెత్ సర్టిఫికెట్ పోయిందని ఓ వ్యక్తి పేపర్లో ప్రకటన ఇవ్వడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. ఒక వ్యక్తి ‘నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో తన మరణ ధృవీకరణ…