రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. ఇటీవల విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ని అరెస్టు చేసి జైలుకి పంపిన సంగతి తెలిసిందే. అలాగే, పాతబస్తీకి చెందిన ముస్లిం నేతపై కేసు నమోదు చేశారు. తాజాగా సోషల్ మీడియాలో కామెంట్లు, షేర్ చేయడం, వీడియోలు పోస్టు చేసేవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
Read Also: AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే మూడు రాజధానులపై చర్చ..?
తాజాగా బీజేపీ కార్పొరేటర్ పై కేసు నమోదైంది. ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ లో మన్సూరాబాద్ బీజేపీ కార్పోరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు. పశ్చింబెంగాలు విద్వంసం విడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోలీసులపై దాడులు చేయాలంటూ పోస్ట్ లు పెట్టడంతో పోలీసులు తీవ్రంగా స్పందించారు. కార్పొరేటర్ పై 163A, 509, 505(2), 506,153 189కింద కేసులు నమోదు చేశారు. విద్వంసం ప్రేరేపించాడని అభియోగాల కింద కేసు నమోదయింది. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎల్ బి నగర్ పోలీసులు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Read Also: Case on Corporator Narsimha Reddy: మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిపై కేసు