Virat Kohli: కొత్త లుక్‌లో విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌తో పాటు ట్రెండ్‌ను కూడా ఫాలో అవుతుంటాడు. తాజాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం విరాట్ కోహ్లీ మొహాలీ చేరుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 మ్యాచ్ ఈ నెల 20న మొహాలీలోని పీసీఏ స్టేడియంలో జరగనుంది. ఈ సందర్భంగా మొహాలీ ఎయిర్‌పోర్టులో విరాట్ కోహ్లీ దిగిన ఫొటోలను పీసీఏ తన ట్విటర్‌లో పంచుకుంది. ఈ ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించాడు. అతడి కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ రషీద్ సల్మాని కోహ్లీకి హెయిర్ కట్ చేసి కొత్త లుక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడు కూడా కోహ్లీ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘న్యూ లుక్ ఫర్ కింగ్ కోహ్లీ’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
Read Also: Typhoon Nanmadol: జపాన్‌ను భయపెడుతున్న తుఫాన్.. 20 లక్షల మంది ప్రజలపై ప్రభావం
Also Read
- Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
- IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
- Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
- Six Centuries in One Day: సెంచరీల సండే.. ఒకే రోజులో 6 శతకాలు.. కోహ్లీ, గిల్ సహా దిగ్గజాల విధ్వంసం
విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కోహ్లీ కొత్త లుక్ బాగుందని అభిమానుల నుంచి కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ఆసియాకప్‌లో రాణించిన కోహ్లీ రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలకంగా మారాడు. సుమారు మూడేళ్ల తర్వాత కోహ్లీ సెంచరీ చేయడంతో అతడిపై అంచనాలు పెరిగిపోయాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లతో సొంతగడ్డపై జరిగే టీ20 సిరీస్‌లలో విరాట్ కోహ్లీ ఎలా రాణిస్తాడో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు విరాట్ కోహ్లీని తాను మిస్ అవుతున్నానని అతడి భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ‘ఈ వ్యక్తితో ఉంటే ప్రపంచం చాలా ప్రకాశవంతంగా, మరింత ఉత్సాహంగా, ఎంతో సరదాగా… అంతకుమించి అందంగా కనిపిస్తుంది. ఇతనితో కలిసి హోటల్ గదిలో బయో బబుల్‌లో గడిపినా బాగుంటుంది…’ అంటూ అనుష్క శర్మ పోస్ట్ చేసింది. ఈ పోస్టులో ‘#MissingHubby టూ మచ్ పోస్ట్’ అంటూ రాసుకొచ్చింది.
తాజావార్తలు
-
Virat Kohli: తల దించుకోవాలి.. సాకులు చెప్పొద్దు.. పరుగెత్తను అంటే కుదరదు!
-
Lovely Professional University: క్యాంపస్‌లో చెలరేగిన హింస.. 10 రోజుల పాటు క్లాసులు బంద్, మిడ్‌టర్మ్ పరీక్షలు వాయిదా!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!