Nepal Crisis: నేపాల్ ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం తర్వాత చెలరేగిన జనరల్ జెడ్ విప్లవం ప్రభుత్వాన్ని కూలదోసింది. అవినీతికి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం కారణంగా.. నేపాల్ వీధుల్లో హింస, అల్లర్లు, అనిశ్చితితో నెలకొన్నాయి. దీని అతిపెద్ద ప్రభావం ఉపాధి కోసం నేపాల్ నగరాలు, పట్టణాలకు వెళ్లి.. పనిచేస్తున్న భారతీయ కార్మికులపై పడింది. రోజు రోజుకూ పరిస్థితి దిగజారడంతో కార్మికులు భారత్ కు కాలినడకన తిరిగి రావడం ప్రారంభించారు.
నేపాల్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సోమవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో భద్రతా దళాలు-నిరసనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 20 మంది నిరసనకారులు చనిపోయారు. ఇక కేపీ శర్మ ఓలి ప్రభుత్వం నిరసనలకు దిగొచ్చి... సోషల్ మీడియాపై విధించిన బ్యాన్‌ను ఎత్తేసింది.
నేపాల్‌లో ఒక రోజంతా అల్లకల్లోలం తర్వాత, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధాన్ని ప్రభుత్వం ఉపసంహరించింది. నిరసనకారులు తిరిగి రావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విధ్వంసం, దహనం సంఘటనలపై దర్యాప్తుకు ఆదేశించింది. హింసాత్మక నిరసనలపై, ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలి మాట్లాడుతూ.. ఈ నిషేధం నిజమైన ఉద్దేశ్యాన్ని ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నిరసనకారుల చొరబాటు కారణంగా భయంకరమైన పరిస్థితి ఏర్పడిందని అర్ధరాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రధాన మంత్రి ఓలి తెలిపారు. ఖాట్మండుతో…
Gen Z protest in Nepal: నేపాల్‌లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ‘జనరేషన్ – జెడ్ (Gen Z) విప్లవం’గా పేరుపొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంటు సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 16 మంది నిరసనకారులు మరణించగా, వందలాది…
Social Media: చిన్న పిల్లలపై సామాజిక మాధ్యమాల ప్రభావాన్ని అరికట్టేందుకు ఆస్ట్రేలియా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించకుండా ఓ చట్టం తీసుకు వచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఈరోజు (బుధవారం) ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం మనిషి.. మనుషులతో కంటే.. మొబైల్‌తోనే ఎక్కువ గడుపుతున్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి నడి వయసులో ఉన్న పెద్దోళ్ల వరకు ఫోన్‌తోనే గడుపుతున్నారు. అంతగా మనుషులు మొబైల్‌కు బానిసైపోయారు.
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉండేలా ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తుంది. ఆన్లైన్ నుంచి పిల్లలను రక్షించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఆంథోనీ అల్బనీస్ చెప్పారు.
Rishi Sunak: యూకే ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ బ్యాన్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. అయితే దీనిపై చర్చల విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి అక్కడి ప్రభుత్వ వర్గాలు. సోషల్ మీడియా వల్ల పిల్లలపై ఎంత వరకు హాని కలుగుతుందనే విషయంపై మంత్రులు జనవరి నుంచి సంప్రదింపులు ప్రారంభించాలని యోచిస్తున్నారు.