Australia: ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
- ఆస్ట్రేలియా కీలక నిర్ణయం
- 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం మనిషి.. మనుషులతో కంటే.. మొబైల్‌తోనే ఎక్కువ గడుపుతున్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి నడి వయసులో ఉన్న పెద్దోళ్ల వరకు ఫోన్‌తోనే గడుపుతున్నారు. అంతగా మనుషులు మొబైల్‌కు బానిసైపోయారు. దీనికి తోడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. రీల్స్ చేయడం.. లేదంటే ఏవైనా ప్రోగ్రామ్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం.. ఇలా పిల్లలు బిజీ అయిపోతున్నారు. దీంతో మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఎప్పుడైనా సోషల్ మీడియా యాప్‌ల్లో అంతరాయం కలిగితే… ఎంత గాబరాపడిపోతుంటారో. దీని బట్టి చెప్పొచ్చు. సోషల్ మీడియా ప్రభావం మనుషులపై ఎంతగా ఉందో చెప్పడానికి ఇంత కంటే మరో ఉదాహరణ లేదు.
సోషల్ మీడియా యుగంలో పిల్లల భవిష్యత్ దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తోంది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధించాలని ఆస్ట్రేలియా యోచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ మొదలైన సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించకుండా 16 ఏళ్లలోపు పిల్లలను నిషేధించడానికి ప్రపంచంలోనే ప్రముఖ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆస్ట్రేలియా తెలిపింది. ఈ చట్టాన్ని ఈ ఏడాదే ఆస్ట్రేలియా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. చట్టం చేయగానే 12 నెలల్లోనే అమలులోకి రానుంది. చట్టసభ సభ్యులు ఆమోదించిన తర్వాత తల్లిదండ్రుల సమ్మతితో పిల్లలకు వయోపరిమితిపై ఎలాంటి మినహాయింపులు ఉండవు.
Also Read
- Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత చెడిపోతుందన్న ఆలోచనతోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. అశ్లీల చిత్రాలు, దృశ్యాలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతుండడంతో ఆస్ట్రేలియా ఆందోళన వ్యక్తం చేసింది. యువత పెడదారిన పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే తల్లిదండ్రులు, మేధావులతో ఈ అంశంపై ప్రభుత్వం చర్చించింది. సోషల్ మీడియా కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కచ్చితంగా సోషల్ మీడియాపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి తల్లిదండ్రులు, మేధావులు సూచించారు. చట్టం అమల్లోకి వస్తే.. వయసును నిర్ధారించడానికి ప్రత్యేకమైన eSafety కమీషనర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే eSafety కమీషనర్ జరిమానాలు విధించనుంది. నవంబర్‌లోనే ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!