Gen Z protest in Nepal: ఖాట్మండులో రక్తపాతం.. 16 మంది మృతి, వందలాది మందికి గాయాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gen Z protest in Nepal: నేపాల్‌లో అవినీతి, సోషల్ మీడియా నిషేధంపై యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఇటీవల 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ‘జనరేషన్ – జెడ్ (Gen Z) విప్లవం’గా పేరుపొందింది. సోమవారం ఆందోళనకారులు, పోలీసులు పార్లమెంటు సమీపంలో ఘర్షణ పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కనీసం 16 మంది నిరసనకారులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.
Also Read
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
వేలాది మంది యువ నిరసనకారులు ఖాట్మండు వీధుల్లోకి వచ్చి, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకు సాగారు. ఘర్షణలు తీవ్రం కావడంతో, పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో అధికారులు రాజధానిలో కర్ఫ్యూ విధించారు. పరిస్థితిని నియంత్రించడానికి ఖాట్మండులోని నిరసన ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
ప్రస్తుతం ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలి నివాసంలో అత్యున్నత స్థాయి జాతీయ భద్రతా మండలి సమావేశం కొనసాగుతోంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ ఏక్ నారాయణ్ ఆర్యాల్, ఆర్థిక మంత్రి బిష్ణు పౌడెల్, హోంమంత్రి రమేష్ లేఖక్, విదేశాంగ మంత్రి అర్జు రానా డియోబా, రక్షణ మంత్రి మన్బీర్ రాయ్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ పాల్గొంటున్నారు.
జీఎస్‌టీ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన Toyota కార్ల ధరలు.. ఏకంగా రూ.3.49 లక్షల తగ్గింపు!
సెప్టెంబర్ 4న ప్రభుత్వం ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించాలని తీసుకున్న నిర్ణయంతో ఆ దేశ యువత ఉద్యమం మొదలు పెట్టింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోకపోవడం వల్ల ఈ నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే, దీనిపై దేశవ్యాప్తంగా యువత తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!