కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కేవలం ప్రకటనతోనే ‘డాకు మహారాజ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా…
సీతారామం, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూసిన తర్వాత.. అరరె ఈ సినిమాలు మన తెలుగు హీరోలతో చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి కథలు మన హీరోల దగ్గరికి వస్తున్నాయా?, వస్తే రిజెక్ట్ చేస్తున్నారా?, లేదంటే మనోళ్లకు ఆ కథలు సూట్ అవ్వరని దర్శకులు భావిస్తున్నారా? అనేది తెలియదు. ధనుష్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మాత్రం తెలుగులో సినిమాలు చేస్తూ.. మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్లే కాదు మరికొంత మంది…
ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, తొలి చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ పుష్పక విమానం’ పర్వాలేదనిపించాడు. ఆ వచ్చిన ‘బేబీ’ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. హిట్ తో పాటు పలు అవార్డులు సైతం తెచ్చి పెట్టింది బేబీ. అదే జోష్ కానీ ఆ వెంటనే వచ్చిన ‘గంగం గణేశా’ చిన్నకొండకు నిరాశమిగిల్చింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్యతో మరోసారి జోడిగా ‘డ్యూయెట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ…
చేసిన మొదటి వెబ్ సిరీస్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఆదిత్య హాసన్ కి వరుస అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటికే నితిన్ హీరోగా ఆయన ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన మరో సినిమాకి ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా #90స్ దర్శకుడు ఆదిత్య హాసన్ దర్శకుడిగా ఒక సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ నిర్మించబోతున్నారు. ఇప్పటికే…
దుల్కర్ సల్మాన్ జోరు మీద ఉన్నాడు. అటు మలయాళం ఇటు స్ట్రయిట్ తెలుగు సినిమాల షూటింగ్స్ తో బిజీబిజీగా ఉన్నాడు దుల్కర్. దుల్కర్ కు ఇప్పుడు తెలుగులో మంచి మార్కట్ ఏర్పడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన టాలీవుడ్ డెబ్యూ మూవీ సీతారామం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ జోష్ లోనే మరొక స్ట్రయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దుల్కర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్కీ భాస్కర్ సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్.…
Ruhani Sharma to Romance with Allari Naresh: ఒక్కోసారి హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా వాళ్లకు కాలం కలిసి రాక హిట్లు ఏ మాత్రం పడకుండా ఉంటాయి. తెలుగులో అందానికి కొదవలేదు కానీ మంచి హిట్ ట్రాక్ రికార్డు ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ. ఈ క్రమంలో బిజీగా ఉన్న హీరోయిన్ల వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు కానీ టాలెంట్ ఉండి పక్కన కూర్చున్న హీరోయిన్లను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.. అయితే గత కొంతకాలంగా…
కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు పయనమైంది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక…
Naveen Polishetty Anaganaga Oka Raju: నవీన్ పోలిశెట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో చేసింది తక్కువ సినిమాలే అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. హీరో కాకముందు నవీన్ చిన్న సినిమాలలో కొన్ని పాత్రలో నటించి మెప్పించాడు. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కుర్ర హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అద్భుతమైన కంటెంట్ తో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం…
"హ్యాపీ బర్త్డే అశోక్" అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసింది సినిమా యూనిట్. అలాగే ఇది నేటి తరం యువతకు సులభంగా చేరువయ్యే చిత్రంగా కనిపిస్తోందని అన్నారు.