అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. యంగ్ డాన్సింగ్ డాల్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ లెనిన్ గ్లిమ్స్ సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటిని పెంచింది.
Also Read : Mamitha Baiju : ఒక్క హిట్.. వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్న కేరళ కుట్టి
అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి శ్రీలీలను తొలగించారని తెలుస్తోంది. వస్తావనికి లెనిన్ లో మొదట వేరే హీరోయిన్ ను అనుకున్నారు. కానీ శ్రీలీల అయితే అఖిల్ సరసన జోడి బాగుంటుందని, డాన్స్ లు బాగా చేస్తుందని తానైతే పర్ఫెక్ట్ అనుకుని ఆమెను తీసుకున్నారు. కొంత మేర షూటింగ్ చేసాక ఇప్పుడు అఖిల్ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేను అని చెప్తోంది. ఇప్పటికే ఆమె కోసం షూటింగ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న మేకర్స్ ను మరికొద్ది రోజుల టైమ్ అడగడంతో శ్రీలీల కోసం వెయిట్ చేయడం కంటే మరోకరితో చేయడం బెటర్ అని ఈ ప్రాజెక్ట్ నుండి ఆమెను తొలగించి మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారు. మరోవైపు శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ మీద ఉన్న ఇష్టంతో తెలుగు సినిమాలను దూరం పెడుతుంది అనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరను మాత్రం ఫినిష్ చేస్తోంది శ్రీలీల.