అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న చిత్రం లెనిన్. వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ, మనం, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను తీసుకుని 8 రోజుల పాటు షూటింగ్ కూడా చేసారు. ఆ మధ్య రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో కూడా శ్రీలీలకు సంబందించిన సీన్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుండి శ్రీలీల ను తొలగించారు మేకర్స్.
మరోవైపు శ్రీలీల హిందీలో కార్తీక్ ఆర్యన్ తో ఓ సినిమా చేస్తోంది. అలాగే మరో రెండు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినినిమల కోసం లెనిన్ సినిమాకు డేట్స్ అడ్జెస్ట్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ వస్తుండడంతో శ్రీలీల కోసం వెయిట్ చేయడం కంటే మరోకరితో చేయడం బెటర్ అని ఈ ప్రాజెక్ట్ నుండి ఆమెను తప్పించారు. కాగా ఇప్పుడు అఖిల్ సరసన హీరోయిన్ కోసం చూస్తున్న మేకర్స్ లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్స్ ను ఒకే చేసారని తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ నార్త్ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం రామ్ సరసన ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ తో కాంత లో నటిస్తున్న భాగ్యశ్రీ బోర్స్ ను లెనిన్ లో అఖిల్ తో ఆడిపాడేందుకు ఆన్ బోర్డ్ చేయబోతున్నారు. నేడో రేపో అధికారక ప్రకటన రాబోతున్నట్టు యూనిట్ వర్గాల సమాచారం;.