బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అదే జోష్ లో ఓ వైపు బాలీవుడ్ సినిమా వార్ 2ను అలాగే ప్రశాంత్ నీల్ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు తారక్. వార్ 2లో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. స్ట్రయిట్ బాలీవుడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
Also Read : HHVM : వీరమల్లు రిలీజ్ డేట్ పై ముంబైలో మకాం వేసిన నిర్మాత
కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. టాలీవుడ్ కు చెందిన బడా నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ వార్ 2 రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అలాగే నైజాం థియేటర్స్ కింగ్ పిన్ అయిన ఏషియన్ సినిమాస్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన ఏషియన్ సునీల్ కూడా వార్ 2 తెలుగు రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే వార్ 2 మేకర్స్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమ తెలుగు రైట్స్ ను అటు ఇటుగా రూ. 150 కోట్లు మేర చెప్తున్నారని సమాచారం. అంత మొత్తం కూడా ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట సదరు తెలుగు నిర్మాతలు. మరోవైపు దాదాపుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ చేతికి వార్ 2 రైట్స్ రావొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తుంది. ఎన్టీఆర్ గత చిత్రం దేవర ను నాగవంశీ భారీ ఎత్తున రిలీజ్ చేసి సూపర్ కలెక్షన్స్ రాబట్టాడు. ఎన్టీఆర్ సినిమా కోసం రెండు సంస్థలు పోటీ పడుతున్న నేపథ్యంలో ఎవరు ఈ వార్ లో గెలిచి వార్ 2 రైట్స్ కొనుగోలు చేస్తారో చూడాలి.