MAD 2 : ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందుతోన్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకొని, ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ‘మ్యాడ్ స్క్వేర్’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం అందరిలో నెలకొంది.’మ్యాడ్ స్క్వేర్’ చిత్రం మార్చి 29 శనివారం నాడు విడుదల కావాల్సి ఉండగా, డిస్ట్రిబ్యూటర్ల కోరిక మేరకు ఒక రోజు ముందుగా మార్చి 28 శుక్రవారం నాడు ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు నిర్మాతలు.
Also Read : EMPURAAN : హై ఓల్డేజ్ మూవీగా ఎంపురన్
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజా నిర్ణయంతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ఫస్ట్ వీక్ లో భారీ వసూళ్ళను రాబడుతుందని అనడంలో సందేహం లేదు. ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాని ఒకరోజు ముందుగా విడుదల చేస్తుండటంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందిస్తూ, “మా పంపిణీదారుల అభ్యర్థన మరియు మద్దతుతో ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం ఒక రోజు ముందుగా మార్చి 28వ తేదీన వస్తుంది. చివరి నిమిషంలో విడుదల తేదీ మార్చాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. మార్చి 29న అమావాస్య కావడంతో, మా పంపిణీదారులు విడుదలను ముందుకు తీసుకెళ్లడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం పట్ల మేము కూడా సంతోషంగా ఉన్నాము. ‘మ్యాడ్ స్క్వేర్’తో పాటు మార్చి 28న విడుదల కానున్న ‘రాబిన్‌హుడ్’ చితం కూడా ఘన విజయం సాధించాలని మనస్ఫూరిగా కోరుకుంటున్నాను. ఈ వేసవికి నవ్వుల పండుగ రాబోతుంది.” అన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా ‘టిల్లు స్క్వేర్’ బాటలో పయనించి, మరో ఘన విజయాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. పైగా ‘లక్కీ భాస్కర్’, ‘డాకు మహారాజ్’ వంటి ఘన విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘మ్యాడ్ స్క్వేర్’తో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ ను సాధిస్తామనే నమ్మకంతో సితార ఉంది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!