టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్‌లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను..
అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి వెంకీ అట్లూరి, సూర్య హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే ఘనంగా జరిగాయి. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తయిన వెంటనే, మరోసారి ఆయన ధనుష్‌తో ఒక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ధనుష్‌తో చేసిన సార్ సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఆయనకు తమిళంలో కూడా మంచి పేరు తెచ్చింది.
Also Read:రుహనీ ఏంటీ కహానీ.. ఏకంగా జిప్ కిందకు లాగేశావ్?
ఇప్పుడు ధనుష్ కోసం ఆయన మరో కథ సిద్ధం చేసుకున్నాడని, యువ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే కథ చెప్పడంతో ఆయనకు బాగా నచ్చిందని కూడా తెలుస్తోంది. దీంతో సూర్య సినిమా పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధనుష్ హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోందన్నమాట. ఇక ప్రస్తుతానికి ధనుష్ కుబేర సినిమా పూర్తి చేశాడు. ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించిన ఆడియో రిలీజ్ నిన్న సాయంత్రం చెన్నైలో అత్యంత వైభవంగా జరిగింది.