ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ ముగింది. సిట్ అధికారులు ఆయనను దాదాపు 8 గంటల పాటు విచారించారు. ప్రభాకర్ రావుపై డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నేటి విచారణ ముగియగా.. జూన్ 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు సిట్ అధికారులు సూచించారు. విచారణకి ఎప్పుడు పిలిచినా…
ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసిన ఘనుడు ప్రభాకర్ అని పేర్కొన్నారు. తమ లాంటి అనేక మంది కార్యకర్తల ఉసురు ప్రభాకర్ పోసుకున్నాడన్నారు. అమెరికాలోనే ప్రభాకర్ రావుకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంతో కౌన్సిలింగ్ తంతు పూర్తయ్యిందని.. పథకం ప్రకారమే లొంగిపోయి విచారణకు హాజరయ్యారన్నారు. విచారణలో ప్రభాకర్ రావు ఇచ్చిన…
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింది సిట్. ఈ క్రమంలో తిరుమల లడ్డు నెయ్యి కేసులో డొంక కదులుతోంది. సిట్ ఇప్పటికీ చార్జ్ షీట్ వేసింది. భోలేబాబా డెయిరీ కేంద్రంగా దర్యాప్తు చేస్తోంది.. తాజాగా టీటీడీలో జరిగిన అంశాలపై దర్యాప్తు ప్రారంభమైంది. Also Read:Telegram Global Contest: కంటెంట్ క్రియేటర్ల…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన రిటైర్డు ఐఏఎస్ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పాత్రపై రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు పేర్కొంది సిట్.. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొన్న అంశాలు చర్చగా మారాయి.. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇతరులతో కలిసి లిక్కర్ సిండికేట్ గా ఏర్పడ్డారు.. ఈ సిండికేట్ లో ఉన్నతాధికారులు, పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులు ఉన్నారు.. నిందితులు లిక్కర్ సిండికేట్ సభ్యుడు, ఈ కేసులో ఏ1గా…
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండవ రోజు కస్టడీకి తీసుకుంది. శ్రీధర్ రెడ్డిని ఉదయం విజయవాడ జిల్లా జైలు నుంచి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్ కార్యాలయానికి ఆయన్ను అధికారులు తరలించారు. సిట్ కార్యాలయంలో విచారణ ప్రారంభమైంది. నిన్న ఏడు గంటల పాటు శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. కీలక ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. Also…
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఈరోజు ఉదయం గోవిందప్పను అరెస్ట్ చేసి.. విజయవాడకు తీసుకొస్తున్నారు. భారతీ సిమెంట్స్‌లో గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో అయన ఏ33గా ఉన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉంది. Also Read: Suresh Babu: సంజాయిషీపై…
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ1 రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి) తొలి రోజు కస్టడీ పూర్తయింది. శుక్రవారం ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు సిట్ ఆయన్ను విచారించింది. లిక్కర్ అమ్మకాలు, డిస్టలరేస్ నుంచి ముడుపుల వసూలు అంశాలపై రాజ్ కసిరెడ్డిని సిట్ విచారించింది. లిక్కర్ పాలసీ, ప్రైవేట్ వ్యక్తులతో మీటింగ్స్, హవాలా వ్యవహారంపై ఆరా తీసింది. సిట్ అధికారుల ప్రశ్నలకు రాజ్ కసిరెడ్డి సరైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. Also Read: Group…
ఏపీ లిక్కర్ కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డితోపాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా రాజ్ కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం ఆయన దగ్గర ఉందని భావిస్తున్నారు.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా.. దిలీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్‌ను ఈరోజు రాత్రికి విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజ్ కసిరెడ్డి పీఏ వద్ద కీలక ఆధారాలు ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడు రాజ్…