Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో కీలక పరిణామం నెలకొంది. మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశానని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదని పేర్కొన్నారు. తనపై అధికారి అయిన డీజీపీ చెప్తేనే అన్నీ చేశాను అని ఆయన తేల్చి చెప్పారు. చాలా వరకు తెలియదు.. గుర్తులేదనే సమాధానాలను ప్రభాకర్ రావు చెప్తున్నారని సిట్ అధికారులు తెలిపారు.
అయితే, 2023 నవంబర్‌లో ఫోన్ ట్యాపింగ్ చేసిన వారిని పిలిచి సిట్ అధికారులు విచారిస్తున్నారు. 615 ఫోన్ నెంబర్లను ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్లు తేలింది. ఐఏఎస్‌లతో పాటు పోలీసు అధికారుల ఫోన్లనూ కూడా ఆయన ట్యాప్ చేసినట్లు సమాచారం. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు కిందిస్థాయి అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పుకొచ్చింది సిట్.