Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేంద్ర మంత్రికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమైన సిట్
- హైదరాబాద్: బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్..
- బండి సంజయ్‌కు ఫోన్ చేసిన సిట్ అధికారులు..
- నోటీసులు ఇచ్చి.. సమయం ఇస్తే వాంగ్మూలం తీసుకుంటామన్న సిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైయ్యారు. ఈరోజు (జూన్ 20) సాయంత్రం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్.. మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించారు. విచారణకు సిద్ధంగా ఉండాలని పోలీసులు కోరారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి వాంగ్మూలం తీసుకునేందుకు సమయం అడిగారు. అయితే, షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానని ఆయన తెలిపారు. రేపో మాపో సిట్ నోటీసులు జారీ చేయనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్.. కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు ఆరోపించారు. కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, ప్రధాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు.
Read Also: Laya : బాలకృష్ణ మూవీ కోసం ఏడ్చారా.. లయ క్లారిటీ..
Also Read
ఇక, కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలను బండి సంజయ్ నిర్వహించారు. బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు బండి సంజయ్ తో పాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను గత్ సర్కార్ ట్యాపింగ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి సంజయ్ నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ పేరుతో అరెస్ట్ చేశారు పోలీసులు. కరీంనగర్ ఎంపీ ఆఫీసులో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు అనేక విధాలుగా ప్రయత్నించి భంగపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొలేక ఫోన్ ట్యాపింగ్ తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలుమార్లు బహిరంగ సభల్లో, మీడియా వేదికల ద్వారా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆరోపించారు. భార్యాభర్తల మధ్య సంభాషణలను కూడా ట్యాప్ చేసి నీచానికి ఒడిగట్టిందన్నారు. బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనని సిట్ వర్గాలు తెలియజేస్తున్నాయి. వందలాది మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు నిర్ధారణ చేసింది. సాక్షిగా బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునేందుకు సిద్ధమైంది. దీంతో బండి సంజయ్ వాంగ్మూలంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?