ఏపీ లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. ఇంతకు ముందు విచారణ సమయంలో కొన్ని కీలక వివరాలు సిట్‌కు ఇచ్చినట్లు చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్‌కాగా.. ఇవాళ విచారణ సమయంలో విజయసాయిరెడ్డిని సిట్ ప్రశ్నించనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతున్న మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో నిందితులుగా ఉన్న వారి ఆస్తుల జప్తునకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. రూ.32 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతి ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు ఆగస్ట్ ఒకటో తేదీ లోపు నోటీసులు ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. గతంలో ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద పట్టుబడిన రూ.8కోట్ల నగదు సహా డిస్టిలరీలు, నిందితుల అనుమానాస్పద…
Phone Tapping Case: తెలంగాణను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోవడంతో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్ళిన వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఇప్పటి వరకు సిట్ అధికారులు ప్రభాకర్ రావును ఐదు సార్లు విచారించారు. సుమారు…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఈ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకి నోటీసులు జారీ చేసింది సిట్.. గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన రజత్ భార్గవ.. కొద్ది నెలల క్రితం రిటైర్ అయ్యారు.. అయితే, ఆయనకు నోటీసులు జారీ చేసిన సిట్.. రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది..
మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విజయవాడ సబ్ జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు. ఇప్పటికే రెండు రోజులు జైలు వద్ద చెవిరెడ్డి హంగామా చేయగా.. నేడు కూడా రచ్చ చేశారు. జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో సిట్ దర్యాప్తుపై చెవిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అవి నిలబడవన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారికి ఏదొకరోజు తప్పకుండా శిక్ష పడుతుందంటూ…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ సబ్ జైలు నుంచి ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేయనున్నారు. చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడులను మూడు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి…
ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచుతున్న ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ, నవీన్‌లను అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.. ఎన్నికల సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కి రూ.8.20 కోట్ల రూపాయలు తరలించినట్టు బాలాజీపై ఆరోపణలు ఉండగా.. ఇండోర్ లో బాలాజీని అదుపులోకి తీసుకున్నారు సిట్ పోలీసులు.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన వందలాది మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో చేవెళ్ల ఎంపి కొండా విశ్వే్శ్వర్ రెడ్డి తన వాంగ్మూళం ఇచ్చేందకు సిట్ ముందు హాజరయ్యారు. గంటన్నరకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిట్ అధికారులు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి తన ఫోన్ ట్యాపింగ్ కు…
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది.. లిక్కర్ స్కాం కేసులో నిందితుల విదేశీ పర్యటనలపై సిట్ ఫోకస్ పెట్టింది. స్కాంలో ముడుపులకు సంబంధించి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా వేర్వేరు దేశాలు కూడా హవాలా మార్గంలో మళ్లించారని ఇప్పటికే అనుమానిస్తున్న నేపథ్యంలో నిందితుల విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను సిట్ సేకరిస్తోంది..
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఎప్పటికప్పడు కొత్త కొత్త ట్విస్ట్‌లు పెరుగుతూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టు సిట్ కూడా కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతేహై... అన్నట్టుగా ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటూనే ఉంది. కానీ... తాజాగా జరుగుతున్న పరిణామాలు మాత్రం సిట్ బృందానికి కూడా ఎక్కడో డౌట్ ఉందా అన్న అనుమానాల్ని పెంచుతున్నాయట.