ఏపీ లిక్కర్ కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి సన్నిహితుడుగా ఉన్నారు.. లిక్కర్ స్కాంలో ముడుపులు సిండికేట్ కు అందటంతో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.. ప్రముఖ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అనిచివేయటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు.. చట్ట విరుద్ధంగా లిక్కర్ ఆర్థర్ ఫర్ సప్లై (OFS) జారీ చేశారట..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు లిక్కర్ కేసు హాట్‌టాపిక్‌గా సాగుతోంది.. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్.. ఓవైపు కీలకంగా భావిస్తోన్న రాజ్ కేసిరెడ్డి విచారణపై దృష్టి పెడుతూనే.. మరోవైపు.. అరెస్ట్‌లపై ఫోకస్ పెట్టింది.. ఏపీ లిక్కర్ కేసు విచారణలో భాగంగా రాజ్ కేసిరెడ్డి కస్టడీ కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.. కేసు విచారణలో భాగంగా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది సిట్..
బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్‌లో నమోదైన కేసులన్నీ సీఐడీకి బదిలీ చేసింది. పంజాగుట్ట, మియాపూర్ లో నమోదైన కేసులో 25 మంది సెలబ్రెటీలపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలను విచారించారు. మరోవైపు.. ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పైన సిట్ ఏర్పాటు చేసింది. ఒకవైపు సీట్ తో పాటు కేసులన్నింటినీ సీఐడీకి బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణకు హాజరవుతానని చెప్పినా అరెస్టు చేశారని న్యాయమూర్తికి తెలిపిన రాజశేఖర్ రెడ్డి. అనంతరం కేసిరెడ్డి రాజ్ కేసులో ఏసీబీ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. కేసిరెడ్డి రాజ్ అరెస్ట్ పై టెక్నికల్ గా తప్పులు ఉన్నాయని నిందుతుడి తరుపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. పీసీ యాక్ట్ నమోదు చేయటం పై న్యాయవాది పొన్నవోలు,…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇవాళ కేసిరెడ్డిని ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. విచారణకు హాజరు అవుతాను అని చెప్పినా అరెస్టు చేశారని న్యాయమూర్తికి తెలిపాడు రాజశేఖర్ రెడ్డి. Also Read:Pahalgam Terror Attack: శ్రీనగర్‌కు బయలుదేరిన హోంమంత్రి అమిత్ షా.. కార్ సీజ్ చేసారు నా ఇంటితో పాటు నా బంధువుల…
లిక్కర్ స్కామ్‌పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ''ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను''
ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఎయిర్ పోర్టు దగ్గర కాపు కాసిన సిట్ అదుపులోకి తీసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన రాజ్ కేసిరెడ్డి. మూడు సార్లు సిట్ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదు కేసిరెడ్డి.. రేపు విచారణకు వస్తానంటూ ఈ మధ్యాహ్నం ఆడియో విడుదల చేశారు. రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ పై…
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు విజయవాడలోని సిట్ విచారణ కార్యాలయం దగ్గరకు వచ్చిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్.. విజయసాయిరెడ్డి మా పార్టీ నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆయన టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నాడు అని ఆరోపించారు..
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు పెంచింది. సిట్ కీలక విషయాలను సేకరించి వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టింది. ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు విజయ సాయిరెడ్డి. ఇవాళ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. విచారణకు రావాలని కసిరెడ్డికి నాలుగోసారి నోటీస్ ఇచ్చిన సిట్.. కసిరెడ్డి విచారణపై కొనసాగుతున్న సస్పెన్స్.. అందుబాటులో ఉండాలని కసిరెడ్డి తండ్రికి సిట్ ఆదేశాలు జారీచేసింది. Also…
ఏపీలో లిక్కర్ స్కాంపై సిట్ లోతైన విచారణ చేపడుతోంది. ప్రధానంగా లిక్కర్ స్కాం వెనుక ఎవరెవరు ఉన్నారు, లిక్కర్ డిస్టలరీస్ దగ్గర ముడుపులు ఎవరి నుంచి ఎవరికి చేరాయి, లిక్కర్ సేల్స్ లో ఎలా స్కామ్‌కు పాల్పడ్డారనే అనే అంశాలపై ప్రధానంగా సిట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే సిట్ కీలక విషయాలను సేకరించింది. ఆ తర్వాతే వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చి విచారణ…