Phone Tapping Case: తెలంగాణలో భారీ సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. గతంలో అధికారంలో ఉన్న కొంతమంది ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, స్పెషల్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన కొందరు అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పలు కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వాధికారులు వంటి అనేక మంది టార్గెట్ అయినట్లు బయటపడడంతో ప్రభుత్వం ప్రత్యేక…
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కటిగా కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.. ట్యాపింగ్ ఎలా చేస్తారు.. ఎప్పుడు చేశారనే విషయాలు బయటకు వస్తున్నాయి.. రివ్యూ కమిటీ కి చైర్మన్ గా ఉన్న మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో పాటు జిఐడి పొలిటికల్ సెక్రటరీ స్టేట్‌మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు.. మూడు ఉప ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు సిట్ తేల్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి.. ఫోన్ ట్యాపింగ్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ వద్ద ఆధారలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రణీత్ రావు నుంచి టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావుకు ట్యాపింగ్ సమాచారం వెళ్లేదని గుర్తించారు. ప్యారడైస్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్ కు చెందిన 70లక్షలు సీజ్ చేసిన విషయం తెలిసిందే. డబ్బుల తరలింపు పై టాస్క్పోర్స్ టీమ్ కు ప్రణీత్ రావు సమాచారం…
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ కన్నా.. బీజేపీనే ఎక్కువగా నమ్ముతోంది. ఈ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్‌ను నియమించినా.. కాషాయ పార్టీ మాత్రం పూర్తిగా విశ్వసించడం లేదట. అందుకే, సీబీఐ డిమాండ్‌ను గట్టిగా వినిపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితుల అరెస్టులపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్టు చేశారు. మిగతా నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు మూడు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే వివాదాస్పదంగా మారిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి మోగిపోతోంది. సిట్ దర్యాప్తులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్న క్రమంలో కవిత ఫోన్ ట్యాప్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రచారం జరగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అదే పార్టీ ఎమ్మెల్సీ కవిత ఫోన్ ట్యాప్ చేశారా? అన్న చర్చ మొదలైంది.
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులు ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమైయ్యారు. ఈరోజు (జూన్ 20) సాయంత్రం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్.. మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించారు.
Phone Tapping Case: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణలో కీలక పరిణామం నెలకొంది. మాజీ డీజీపీ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశానని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. ప్రభుత్వంలోని పెద్దలెవరూ తనకు తెలియదని పేర్కొన్నారు.
Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బుధవారం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ చేపట్టిన దర్యాప్తులో 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కేవలం ఎంపీల ఫోన్లు మాత్రమే కాకుండా, వారితో అనుబంధం ఉన్న ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు…
రేపు సిట్ అధికారుల ముందుకు బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరయ్యే అవకాశం ఉంది. సాధారణ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. 2023 నవంబర్ 15వ తేదీ నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించారు పోలీసులు.