సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ఈరోజు రూ.400 కోట్లు చెల్లిస్తున్నాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా నుంచి సింగరేణి ప్రస్థానం ప్రారంభమైందని, ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి ఎదిగిందని సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణికే ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భట్టి చెప్పారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. ‘తొలిసారి సైంటిఫిక్‌గా రాష్ట్రంలో కులగణన…
ప్రగతి స్టేడియంలో స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వం పై తీవ్రమైన విమర్శలు చేశారు. భారీ వర్షం వచ్చినప్పటికైనా పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలో పాల్గొన్న మహిళలకు కవిత స్వాగతం తెలియజేసారు.
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కోల్ మైన్స్ కంపెనీ మహిళా ఉద్యోగులకు గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్ లేదా బదిలీ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు, సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్‌గా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానించింది.
MLC Kavitha’s Open Letter to TBJKMS: సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారన్నారు. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే తనపై కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు అని, తన తండ్రి కేసీఆర్‌కి రాసిన లేఖను…
సింగరేణిలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిస్థితి కొంత కాలంగా దయనీయంగా మారింది. బీఆర్‌ఎస్ పెద్దల కుటుంబంలో వచ్చిన విభేదాలు సంఘం మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని.. సొంత యూనియన్ నేతలే చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు తాము ఎవరివైపు ఉండాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట టీబీజీకేఎస్ నాయకులు. కవిత, కేటీఆర్‌లో ఎవరికి జై కొడితే... ఎవరు కన్నెర్ర చేస్తారోనని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. ఈ గందరగోళంతో... ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టీబీజీకేఎస్ పరిస్థితి మరింత…
CM Revanth Reddy : ఇవాళ్టి ప్రత్యేక ఘట్టంగా సింగరేణి సంస్థ చరిత్రలో మొదటిసారి బయటి రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభించటంను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 136 ఏళ్లకు పైగా తెలంగాణ సింగరేణి తన బొగ్గు తవ్వకాలను నిర్వహించి రాష్ట్రానికి వెలుగులు పంచుతుంటే, ఇప్పుడు ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్లో తవ్వకాలు ప్రారంభించడం ద్వారా సింగరేణి సంస్థ భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేస్తుంది అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్…
Bhatti Vikramarka : ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గనిని వర్చువల్‌గా ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ఇంధన శాఖా మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ, ఈ ఘట్టం సింగరేణి కంపెనీ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక గని ప్రారంభం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, గర్వానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఒడిశాలో గని ప్రారంభించటం ద్వారా సింగరేణి…
Singareni : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఉన్న సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో నిన్న సాయంత్రం నుంచి విజిలెన్స్ దాడులు కొన సాగాయి. సి ఎం ఓ లో మెడికల్ అధికారి గా ఉన్న ఆమె భర్త ,కూతురు సెల్ ఫోన్ విజిలెన్స్ శాఖ సంబంధించిన పైళ్ళు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్టుగా తెలుస్తుంది. ఈనెల 31న రిటైర్మెంట్ కావలసి ఉండగా తాజాగా విజిలెన్స్ అధికారులు దాడులు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన…
SLBC టన్నెల్లో మృతదేహాలు గుర్తించడానికి కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్ ను తీసుకొచ్చారు. రెండు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ లలో 2 డాగ్స్ ను తీసుకొచ్చారు. రెస్క్యూ టీమ్ డాగ్స్ ను టన్నెల్ లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, NDRF బృందాలు టన్నెల్లోకి వెళ్లాయి... డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్.. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సహాయక బృందాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
Kunamneni Sambasiva Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబుక్యాంపు లోని రజబ్అలి భవన్ లో సింగరేణి.. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధుల తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ పై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి లో ప్రైవేటు వ్యవస్థ లతో బొగ్గు ఉత్పత్తి యత్నాలను విరమించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బావుల మీద శ్రద్ధ చూపకుండా ప్రైవేట్ వ్యాపారల…