Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రకటించిన విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి దివంగత నేత, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ “అభయ హస్తం” పేరిట చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర…
మరోసారి వార్తల్లోకెక్కిన నూహ్.. రెండు పార్టీల మధ్య రాళ్ల దాడి, యువతి మృతి హర్యానాలోని నుహ్ జిల్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో శుక్రవారం పరస్పర విబేధాల కారణంగా రెండు పార్టీల మధ్య భారీ రాళ్ల దాడి జరిగింది. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అక్కడికి పోలీసు బలగాలు భారీగా చేరుకున్నాయి. ఆ…
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించడంతో ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటుచేసుకుంది.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
సింగరేణి సంస్థ దేశ స్వాతంత్ర్యం కంటే ముందు నుంచి ఉన్న సంస్థ.. ఎంతో నిష్ణాతులైన, సమర్ధులైన సిబ్బంది ఉన్న సంస్థ.. బొగ్గు ఉత్పత్తిలో తిరుగులేని నైపుణ్యం ఉన్న సింగరేణి ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
Coal Production: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోల్ బెల్ట్ జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లా ఇల్లందు, కోయగూడెం ఓపెన్‌కాస్ట్ గనుల్లోకి వర్షం నీరు చేరింది.
ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిది.. ఆరోగ్య సంరక్షణకు ‘ఫార్మా’ పరిశ్రమ వెన్నుముక లాంటిదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 73వ ఫార్మా కాంగ్రెస్ లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. దేశంలో 35 శాతం ఫార్మా ఉత్పత్తులు తెలంగాణ నుంచే ఇది మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రతి ఏటా 50వేల కోట్ల విలువైన మందులు ఎగుమతి చేస్తున్నామన్నారు. మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్ 24 గంటలు మా క్యాబినెట్ అందుబాటులో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ…
16 ఎంపీలు సాధించిన టీడీపీ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో చేరి 8 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ , బీజేపీ గెలిచిందని, సింగరేణి బొగ్గు గనులను బహిరంగ మార్కెట్లో రేపు కేంద్రం వేలం వేయబోతుందన్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని, మూడు రోజుల తర్వాత రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో సింగరేణి బొగ్గు గనుల వేలం ఆపాలని అప్పటి…